జైపూర్‌లో జికా వైరస్

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఏడుగురు జికా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. ఈ ఘటన పట్ల ప్రధాన మంత్రి కార్యాలయం అప్రమత్తత ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఓ బృందం జైపూర్‌కు వెళ్లనున్నది. సెప్టెంబర్ 24వ తేదీన ఓ వ్యక్తి జికా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. ఆ తర్వాత సుమారు 22 శ్యాంపిళ్లను పుణెలోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. జైపూర్‌లో జికా వైరస్ వ్యాప్తిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని పీఎంవో ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. జికా వైరస్ సోకిని ఏడుగుర్ని జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ హాస్పటల్‌లో చేర్పించారు. రాజస్థాన్ ఆరోగ్యశాఖ వారిపై నిఘా పెట్టింది. జైపూర్‌లోని శాస్త్రినగర్‌లో మొదటి కేసు నమోదు అయ్యాయి. అక్కడ మెడికల్ టీమ్‌లను ఏర్పాటు…

readMore

దేశవ్యాప్తంగా రేపు మెడికల్ షాపుల బంద్

ఆన్ లైన్ లో మందులు అమ్మకంపై నిరసన ఏఐఓసీడీ పిలుపు మేరకు బంద్ మద్దతిచ్చిన ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ దేశ వ్యాప్తంగా రేపు మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ లో మందులు అమ్మకం, ఈ-ఫార్మసీ విధానాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపు మేరకు రేపు మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఈ బంద్ కు ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (టీటీసీడీఏ) మద్దతు ప్రకటించింది. ఆన్ లైన్ లో మందులు విక్రయించడం డ్రగ్స్ చట్టం నిబంధనకు వ్యతిరేకమని పేర్కొన్న టీటీసీడీఏ ప్రతినిధులు, ఇరవై నాలుగు గంటల పాటు ఈ బంద్ కొనసాగనుందని, ప్రజలు నిత్యం వినియోగించే మందులను కొనుగోలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

readMore

కాఫీ కావాలా.? కాస్త జాగ్రత్త !

ఒకప్పుడు ఇరానీ చాయ్‌కి కేరాఫ్‌గా ఉన్న సిటీలో ఇప్పుడు కాఫీ ఘుమఘుమలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. కాఫీ డేలు, కాఫీషాప్‌లు అనధికార ఆఫీసులుగా, వినోద కేంద్రాలుగా మారిపోతూ గంటల తరబడి కాలక్షేపాలకు వేదికలవుతున్నాయి. సిటీలో కాఫీ ప్రియత్వం ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఇటీవల వెలుగుచూసిన ఓ పరిశోధన కాఫీ ప్రియులైన యువతులకు పలు హెచ్చరికలు చేస్తోంది. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ రీ ప్రొడక్షన్‌ ప్రకారం… జాతీయస్థాయిలో 14శాతం మంది (దాదాపు 2.71 కోట్ల మంది) దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లోని ప్రతి ఆరుగురు జంటల్లో ఓ జంట బాధితులే. జీవనశైలి మార్పులు, ఆరోగ్య పరిస్థితులు, జన్యు పరమైన సమస్యలు వంటివి దీనికి కారణాలుగా వైద్యరంగం పేర్కొంటోంది. ఇదే క్రమంలో మనం ఇష్టంగా తాగే కాఫీ సైతం నట్టింట్లో కేర్‌…

readMore

సారిడాన్ ట్యాబ్లెట్ పై నిషేధం ఎత్తివేత!

గత వారం 328 కాంబినేషన్ డ్రగ్స్ ను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అసురక్షిత మాత్రల జాబితా కింద కేంద్ర ఆరోగ్య శాఖ ఈ 328 మందుల అమ్మకాలు, ఉత్పత్తిపై నిషేధం విధించింది. వీటిలో పెయిన్ కిల్లర్ సారిడాన్ కూడా ఉంది. అయితే, ఆ జాబితాలో ఉన్న సారిడాన్ తో పాటు మరో రెండు మాత్రలపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది. సారిడాన్ ను మార్కెట్లో అమ్ముకోవచ్చంటూ ఈరోజు తీర్పును వెలువరించింది. మన దేశంలో తలనొప్పికి సారిడాన్ ట్యాబ్లెట్ చాలా ఫేమస్. కొన్ని దశాబ్దాలుగా ఈ మాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. Tags: saridon, ban,supreme court ,328 combination , drug

readMore

నన్నపనేనికి ‘డిప్లోపియా’… పేపర్, టీవీ చూడాలన్నా ఇబ్బందే!

nannapaneni rajakumari suffering from diplofiaa

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అనారోగ్యం బారిన పడ్డారు. గత పదిరోజులుగా ఆమె డిప్లోపియా (ప్రతి వస్తువు రెండుగా కనిపించడం) సమస్యతో బాధపడుతూ, గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్తపోటు నియంత్రణలో లేని వారికి ఈ సమస్య తలెత్తుతుంది. కంటి నరాలు బలహీనపడతాయి. ప్రస్తుతం నన్నపనేని ఇదే సమస్యతో బాధపడుతున్నారని, ఆమెకు అధిక రక్తపోటు ఉందని, ప్రతి వస్తువూ రెండుగా కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. ఆమె కాసేపు కూడా టీవీ చూడలేకపోతున్నారు, దినపత్రికలు చదవలేకపోతున్నారు. వీటికితోడు విపరీతమైన తలనొప్పితో చూపు మసకబారింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. Tags: nannapaneni rajakumari, diplofia,television and papers,mahila commissioner

readMore