సూర్యతో డ్యాన్స్ చేస్తున్న రకుల్

‘చిత్రలహరి’ షూటింగులో సాయిధరం తేజ్ ’96’ అక్కడ ’99’గా మారింది! * సూర్య హీరోగా నటిస్తున్న ‘ఎన్జీకే’ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. కొచ్చిలో చిత్రీకరిస్తున్న ఈ పాటలో సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంటున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి కూడా నటిస్తోంది. * గత కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో వున్న సాయిధరం తేజ్ తాజాగా ‘చిత్రలహరి’ చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. * తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ’96’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మరోపక్క ఈ చిత్రాన్ని కన్నడలో కూడా రీమేక్ చేస్తున్నారు. అయితే, అక్కడ దాని టైటిల్ని ’99’గా…

readMore

నాగబాబుపై మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుపై నందమూరి బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. తనకు బాలయ్యబాబు ఎవరో తెలియదని, సీనియర్ నటుడు బాలయ్య మాత్రమే తనకు తెలుసని అన్నారు. ఆయన మాటలతో హర్ట్ అయిన బాలయ్య ఫ్యాన్స్ ‘బాలయ్య ఎవరో మీకు తెలియదా?’ అని ప్రశ్నిస్తున్నారు. జనసేనతో టీడీపీకి ఉన్న వైరం కారణంగానే ఆయనలా అని ఉంటారని మరికొందరు అంటున్నారు. గతంలో ఓసారి బాలకృష్ణ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అన్నారు. దీంతో అప్పట్లో పవన్ అభిమానులు కూడా ఇలాగే బాలయ్యను ట్రోల్ చేశారు. నాలుగేళ్ల క్రితం టీడీపీని గెలిపించాడే.. ఆయనే పవన్ కల్యాణ్ అంటూ కామెంట్లు చేశారు. తన సోదరుడిని ఎవరో తెలియదని బాలయ్య అప్పుడు చెప్పడం వల్లే ఇప్పుడు నాగబాబు ఇలా అన్నారంటూ…

readMore

తొలిసారి ఓటేసి సంబరపడిన నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్!

తొలిసారి ఓటేస్తే వచ్చే ఆనందమే వేరు. మొదటిసారి తనకు నచ్చిన అభ్యర్థికి ఓటేసి, ఆపై వేలికి సిరా చుక్క పెట్టించుకుని బయటకు వచ్చిన తరువాత ఎంతో తృప్తిగా ఉంటుంది. నేడు అదే తృప్తిలో ఉన్నాడు నటుడు శ్రీకాంత్, ఊహల కుమారుడు రోషన్. ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రోషన్ వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు కాగా, నేడు జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ బూత్ నకు తల్లిదండ్రులతో కలసి వచ్చి ఓటు వేశాడు. ఆపై కెమెరాలకు తన వేలిపై ఉన్న ఇంక్ ను చూపుతూ ఫోజులిచ్చాడు. మొట్టమొదటిసారి ఓటు వేయడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా రోషన్ వ్యాఖ్యానించాడు. Tags: telangana, election, voting 2018, celebrities,roshan

readMore

‘బాహుబలి’ రికార్డును అధిగమించిన ‘2.ఓ’ హిందీ వెర్షన్

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘2.ఓ’ .. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు.. తమిళ భాషల్లోనే కాదు హిందీలోను ఈ సినిమా తన జోరును కొనసాగిస్తోంది. తెలుగు .. తమిళ భాషలతో పోలిస్తే హిందీ వెర్షన్లో ఈ సినిమాకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. హిందీ వెర్షన్లో ఈ సినిమా ‘బాహుబలి’ వసూళ్లను అధిగమించింది. హిందీ వెర్షన్ ‘బాహుబలి’ ఫుల్ రన్ లో 117 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ‘2.ఓ’ హిందీ వెర్షన్ కేవలం 5 రోజుల్లోనే 120 కోట్ల షేర్ ను రాబట్టి సరికొత్త రికార్డును నమోదు చేసింది. అయితే ఈ సినిమా ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్ 511 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అందువలన ఈ రికార్డును అందుకోవడం…

readMore

సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న 2.0

నవంబర్ 29 న వరల్డ్ వైడ్ గా రజిని 2.0 రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈసినిమా నిలబడగలిగింది. శని..ఆదివారాల్లో ఈసినిమా వండర్స్ క్రియేట్ చేసింది. కేవలం ఆదివారం ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసింది. నాలుగు రోజుల్లో ఈసినిమా 30 కోట్లు షేర్ ను వసూల్ చేసి స్టాండర్డ్ గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 72 కోట్లు కు కొన్నారు బయర్స్. అంటే ఇంకా సగం కూడా రాలేదు. తొలి వీకెండ్ బాగుంది కాబట్టి ఈ వీక్ కలెక్షన్స్ కూడా బాగుంటాయి అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. సోమవారం నుంచి గురువారం వరకు పీరియడ్‌ని 2.0 స్టడీగా దాటాలి. ప్రస్తుతం పోటీ ఇచ్చే సినిమాలు లేవు కాబట్టి వసూల్ పెరిగే అవకాశముంది.…

readMore