అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని తెలిసే వెళ్లాడు: జాన్ అలెన్ స్నేహితుడు రెమ్కో

సెంటినెలీస్ తెగ ఎంత ప్రమాదకరమైనదో తెలిసే జాన్ అలెన్ చౌ అక్కడికి వెళ్లాడని, వారి గురించి ముందే అధ్యయనం చేశాడని, దురదృష్టవశాత్తు వారి చేతిలో ప్రాణాలు కోల్పోయాడని అతడి స్నేహితుడు రెమ్కో స్నోయెన్జీ తెలిపాడు. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెలీస్ తెగ భాష నేర్చుకుని వారికి మిషనరీ గురించి చెప్పేందుకు వెళ్లిన అమెరికా మిషనరీకి చెందిన జాన్ వారి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, అక్కడికి వెళ్లడానికి ముందే ఆ తెగ గురించి అన్నీ తెలుసుకున్నాడు. వారెంత ప్రమాదకారులో అర్థం చేసుకున్నాడు. పుస్తకాలు చదివాడు. ఆ తెగ గురించి అధ్యయనం చేశాడు. అండమాన్ వెళ్లాక మూడు రోజులు తనతో టచ్‌లో ఉన్నాడని, ఆ తర్వాత అతడు చనిపోయినట్టు తనకు తెలిసిందని రెమ్కో స్నోయెన్జీ వివరించాడు. సెంటినెలీస్ తెగతో ఎలా మసలుకోవాలో కొన్ని రోజులు శిక్షణ కూడా…

readMore

వివాహితతో డీఎస్పీ రాసలీలలు.. బయటపెట్టిన భర్త

తన భార్యతో డీఎస్పీ నడుపుతున్న వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేశాడో భర్త. అయితే, తనను పట్టుకునేందుకు పోలీసులతో వస్తున్న విషయాన్ని పసిగట్టిన డీఎస్పీ వారి కళ్లుగప్పి పరారయ్యాడు. చిత్తూరు జిల్లా తిరుచానూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా బెటాలియన్‌కు చెందిన డీఎస్పీ గతంలో హైదరాబాద్‌లో ఉండేవాడు. ఈ క్రమంలో ఇంటిపక్కన ఉన్న కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు. టీటీడీలోని అటవీశాఖలో ఉద్యోగం ఉందని, తిరుపతి వస్తే ఇప్పిస్తానని ఈ సందర్బంగా ఆ కుటుంబ యజమానిని నమ్మబలికాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన దంపతులు ఆరు నెలల క్రితం హైదరాబాద్ నుంచి తిరుచానూరు షిఫ్టయ్యారు. బాధిత వ్యక్తి కుటుంబం తిరుచానూరు వచ్చిన తర్వాత అతడి భార్యతో డీఎస్పీ సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు. అయితే, ఆరు నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో…

readMore

సుజనాచౌదరికి సమన్లు జారీ చేసిన ఈడీ.. అరెస్ట్ తప్పదా..?

ED seized documents revealing Rs 5700 crore of bank loan frauds by companies

ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశం 120 డొల్ల కంపెనీలు ఉన్నాయని గుర్తించిన ఈడీ బ్యాంకులకు రూ. 5,700 కోట్ల మేర ఎగవేశారన్న అధికారులు టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. 27వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సుజనాచౌదరిపై బ్యాంకులు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని ఆయన కంపెనీలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుజనాచౌదరి అధీనంలో 120 డొల్ల కంపెనీలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. బ్యాంకులకు సుజనా గ్రూపు కంపెనీలు రూ. 5,700 కోట్ల మేర ఎగవేసినట్టు వారు తెలిపారు. ఈ కంపెనీలన్నీ సుజనాచౌదరి ఆదేశాల మేరకే నడుస్తున్నాయని గుర్తించామని చెప్పారు. ఈ కంపెనీలపై ఇప్పటికే డీఆర్ఐ, ఫెమా కేసులున్నాయని తెలిపారు. హైదరాబాద్ కార్యాలయం నుంచి డొల్ల…

readMore

దారి మళ్లుతున్న తిత్లీ నిధులు..?

తిత్లీ తుపాను, తదనంతరం వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదుల వరదలతో దాదాపు 77,690 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. దీనివల్ల 2,07,786 మంది రైతులు నష్టపోయారు. వారికి సుమారు రూ.159.26 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే కొబ్బరి, జీడిమామిడి, అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు 28,083 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఇందుకుగాను 1,10,739 మంది రైతులకు రూ.263.55 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే 9,535 పశువులు, పౌల్ట్రీ కోళ్లు 1.50 లక్షలు చనిపోవడంతో పాటు 16 వేల పశువుల శాలలు, పౌల్ట్రీ షెడ్లు కూలిపోయాయి. ఇందుకుగాను 29,800 మంది రైతులకు పరిహారంగా రూ.34.49 కోట్లు చెల్లించాల్సి ఉంది.అన్ని రకాలు కలిపి 47,606 ఇళ్లు నష్టపోయిన బాధితులకు రూ.49.83 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఇదే తరహాలో మత్స్యశాఖకు సంబంధించి రూ. 8.36…

readMore

ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీపై బ్రాహ్మణుల తీవ్ర ఆగ్రహం!

ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీపై బ్రాహ్మణుల తీవ్ర ఆగ్రహం!

భారత పర్యటనకు వచ్చిన సామాజిక మాధ్యమ దిగ్గజం సీఈఓ జాక్ డోర్సీ, “బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి” అని రాసున్న ఓ పోస్టర్ ను ప్రదర్శించడంపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కొందరు సామాజిక కార్యకర్తలు, మహిళా జర్నలిస్టులతో సమావేశమైన ఆయన, ఈ పోస్టర్ ప్రదర్శించగా, అందులో పాల్గొన్న ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని షేర్ చేశారు. దీనిపై అగ్గిమీద గుగ్గిలమైన బ్రాహ్మణులు, వామపక్ష వాదులతో ఎందుకు సమావేశం అయ్యారని జాక్ డోర్సీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ఒకే వర్గానికి కొమ్ము కాస్తుందా? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ట్విట్టర్ యాజమాన్యం స్పందించింది. జాక్ కావాలనే ఆ పోస్టర్ ను పట్టుకోలేదని, అక్కడికి వచ్చిన ఓ దళిత కార్యకర్త, తన అనుభవాలు వివరించిందని, ఆ పోస్టర్ ను జాక్ కు…

readMore