రహస్యంగా పెళ్లి చేసుకుని మోసం… అత్తింటి ముందు బైఠాయించిన యువతి!

హైదరాబాద్ లో పని చేస్తున్న దేవీ కుమారి, వెంకటేశ్వర్లు రహస్యంగా గుడిలో వివాహం ఆపై తీసుకెళ్లకపోవడంతో యువతి నిరసన ఒకే చోట తనతో కలసి పని చేస్తున్న వ్యక్తి, ప్రేమిస్తున్నానని చెప్పి, రహస్యంగా పెళ్లి చేసుకుని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ఓ యువతి అత్తింటి ముందు బైఠాయించింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, విజయనగరం జిల్లాకు చెందిన దేవీకుమారి, ముండ్లమూరు ప్రాంతానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో కలసి పని చేస్తున్నారు. ఇద్దరి మధ్యా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో, పెళ్లి చేసుకోవాలని భావించారు. గత నెలలో దేవీ కుమారి, వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చి మాట్లాడగా, వారు పెళ్లికి అంగీకరించకుండా, సర్దిచెప్పి తిరిగి పంపించారు. ఆపై తనను విడిచి ఉండలేనని చెబుతూ వెంటేశ్వర్లు ఓ గుడిలో తనను పెళ్లాడాడని దేవి…

readMore

కల్లోల కేరళం కేరళను కమ్మిన మృత్యు మేఘాలు

కేరళను మృత్యు రుతుపవనాలు కమ్మేశాయి. గత వందేళ్లలో ఎప్పుడూలేని విధంగా తీవ్రమైన వరదలు రావడంతో రాష్ట్రం అతలాకుతలమయింది. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి రాష్ట్రానికి చేరుకున్నారు. కేరళలో కేవలం గురువారం ఒక్క రోజునే 106 మంది ప్రాణాలు కోల్పోవడం ఇక్కడి దుస్థితిని తెలియజేస్తోంది. తొలుత దాదాపు 30 మంది చనిపోయారని భావించగా, శుక్రవారం నాటికి ఆ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గత పది రోజుల్లో మరణించిన వారి సంఖË్య 173కు చేరింది. రాష్ట్రంలోకి మే 29న నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, ఇంతవరకు 385 మంది దుర్మరణం చెందారని ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ ప్రకటించారు. ఈ నెల ఎనిమిదో తేదీన నైరుతి రుతుపవనాల రెండో దశ ప్రారంభం కాగా, అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తునే ఉన్నాయి. పది రోజులు గడిచినా తగ్గుముఖం…

readMore

కేరళలో విలయం.. ఎందుకిలా?

దేవుని సొంతభూమిగా ఖ్యాతిచెందిన కేరళ భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. రాష్ట్రంలోని 44 నదులు పొంగిప్రవహిస్తుండటంతో అనేక డ్యాముల ప్రాజెక్టులను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఉత్తరాన కాసర్‌గోడ్‌ నుంచి దక్షిణం చివర ఉన్న తిరువనంతపురం వరకు అన్ని జిల్లాలపై వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో జలవిలయం తాండవిస్తోంది. 1924 అనంతరం ఇంత భారీగా వర్షపాతం రావడం ఇదే కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 99 వరదలు: 1924లో కేరళలో వరదలు బీభత్సం సృష్టించాయి. అప్పట్లో రాష్ట్రం ట్రావెన్కూర్‌, మలబార్‌ ప్రాంతాలుగా ఉండేది. ఆ ఏడాది వర్షాకాలంలో మొత్తం 3348 మి.మీ. వర్షం కురిసింది. అనంతరం ఇన్నేళ్లకు ఆ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు 2 వేల మి.మీ. పై వర్షపాతం నమోదుకావడం గమనార్హం. మళయాళీల…

readMore

పంబ ఉద్ధృతితో నీట మునిగిన శబరిమల ఉపాలయాలు!

పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు పంబా నదిలో 25 అడుగుల ఎత్తున నీరు మూసుకుపోయిన శబరిమల దారి కేరళలోని పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పంబానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, శబరిమలలోని ఉపాలయాలు నీట మునిగాయి. పంబ వద్ద నదిలో నీటిమట్టం 25 అడుగుల ఎత్తునకు చేరుకోవడంతో, కొండపైకి వెళ్లే దారి మూసుకుపోయింది. దీంతో భక్తులను కొండపైకి వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. పంబలోని స్నాన ఘాట్లు, దాని పక్కనే ఉండే యాత్రికుల విశ్రాంతి భవనాలు, షెడ్లు తదితరాలన్నీ నీట మునిగాయి. పంబా నదికి నీరందించే కాక్కి రిజర్వాయర్, పంబా రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ఎగువన కొండల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

readMore

ముంబైలో ఘోరం.. 300 మంది అమ్మాయిల అక్రమ రవాణా!

2007 నుంచి 300 మంది అమ్మాయిల అక్రమ రవాణా ఒక్కో బాలికను రూ.45 లక్షలకు విక్రయం కీలక సూత్రధారి అరెస్ట్ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన మరో దారుణం వెలుగు చూసింది. ఓ అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణ ముఠా ముంబై నుంచి అమెరికాకు ఏకంగా 300 మంది చిన్నారులను విక్రయించినట్టు బటయపడడం సంచలనంగా మారింది. గుజరాత్‌కు చెందిన రాజుభాయ్ గమ్లేవాలా నేతృత్వంలోని ముఠా ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2007 నుంచి ఇప్పటి వరకు 300 మంది నిరుపేద బాలికలను అమెరికాకు అక్రమంగా తరలించి విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. బాలికలంతా గుజరాత్‌కు చెందినవారేనని, 11-16 ఏళ్ల మధ్య వయసు వారేనని పోలీసులు పేర్కొన్నారు. ఒక్కో అమ్మాయిని రూ. 45 లక్షలకు అమెరికన్లకు విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గుజరాత్‌లోని నిరుపేదలను ఎంచుకునే ముఠా…

readMore