నోట్ల రద్దుకు రెండేళ్లు: ‘రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్’

నోట్ల రద్దుకు రెండేళ్లు: 'రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్'

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించి, తన కేబినెట్ సహచరులతో పాటు మొత్తం దేశప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు చేసిన ప్రసంగంలో.. రాత్రి 12 గంటల నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు. తనకు 50 రోజులు గడువు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ”నేను మీ నుంచి కేవలం 50 రోజుల గడువును కోరుతున్నాను. నాకు డిసెంబర్ 30 వరకు గడువు ఇవ్వండి. డిసెంబర్ 30 తర్వాత నా తప్పు ఉందని తేలితే, మీరు నన్ను ఏ చౌరస్తాలోనైనా నిలబెట్టి, ఏ శిక్ష విధించినా భరిస్తాను” అన్నారు. దేశప్రజలకు శరాఘాతంగా పరిణమించిన తన నిర్ణయాన్ని ఆయన నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యగా…

readMore

ఇండియాలో తొలిసారి… పెట్రోలు ధరను దాటేసిన డీజిల్ ధర!

ఇండియాలో తొలిసారి... పెట్రోలు ధరను దాటేసిన డీజిల్ ధర!

భువనేశ్వర్ లో చరిత్ర సృష్టించిన డీజిల్ పెట్రోలు కన్నా 12 పైసల ధర అధికం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం భారతదేశ చరిత్రలో తొలిసారిగా పెట్రోలు ధరను డీజిల్ అధిగమించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఇది జరిగింది. ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం కారణంగానే గతంలో ఎన్నడూ లేని ఈ పరిస్థితి వచ్చిందని వాహనదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. సాధారణంగా పెట్రోలు ధరతో పోలిస్తే, డీజిల్ ధర 10 శాతం వరకూ తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ, భువనేశ్వర్ లో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 80.57కాగా, డీజిల్ ధర రూ. 80.69గా ఉంది. ఆయిల్ కంపెనీలపై పట్టు కోల్పోయిన కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ఇటువంటి దయనీయ స్థితి ఏర్పడిందని ఒడిశా ఆర్థిక శాఖ మంత్రి శశిభూషణ్…

readMore

China Wants to Replace Streetlights With a Trio of Artifical Moons

China Wants to Replace Streetlights With a Trio of Artifical Moons

One moon is enough for most of us, but not for officials of the Chinese city Chengdu. They want four, and are willing to spend a good amount of money to make it happen. The plan from Chinese leaders is to put three small, highly reflective satellites in orbit by around 2020. These satellites would reflect light at night and be be around 8 times brighter than the light from a full moon, enough to brighten the streets of Chengdu without spending any electricity on lighting. Such a plan, if it…

readMore

చమురు కంపెనీలకు నరేంద్ర మోదీ విన్నపం… అంత సీను లేదన్న సౌదీ అరేబియా!

crude oil,narendra modi, saudi arabia

అధిక ఇంధన ధరలు ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిని ప్రమాదంలో పడేస్తున్నాయని, చెల్లింపుల విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై సౌదీ అరేబియా నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది. క్రూడాయిల్ ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి ఖలీద్ ఏ అల్ ఫలీహ్ వ్యాఖ్యానించారు. ప్రపంచానికి చాలినంత క్రూడాయిల్ ఉత్పత్తిని కొనసాగించేందుకు అభ్యంతరం లేదని చెప్పిన ఆయన, ధరల విషయంలో మాత్రం తాము చేయగలిగిందేమీ లేదని, భారత విన్నపాన్ని మన్నించలేమని అన్నారు. తమబోటి వారిపై బయటి నుంచి ఎన్నో వత్తిళ్లు వస్తున్నాయని, తాము కావాలంటే సరఫరాను మాత్రం నియంత్రించగలమని తేల్చి చెప్పారు. కాగా, డాలర్‌ తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పతనంకాగా, ఇతర దేశాల కరెన్సీల విలువ కూడా క్షీణిస్తున్న…

readMore

ఎస్‌బీఐ కూడా ప్రకటించేసింది.. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!

bi offers,cashbacks,yono app,discount

దసరా, దీపావళిని పురస్కరించుకుని భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్‌బీఐ) భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. ఆ సంస్థ తీసుకొచ్చిన యోనో యాప్ ద్వారా ఈ పండుగ సీజన్‌లో కొనుగోళ్లు జరిపే వారికి భారీ రాయితీలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. డిజిటల్ షాపింగ్ వేదికను అందిస్తున్న ఏకైక బ్యాంకు తమదేనని పేర్కొన్న ఎస్‌బీఐ ఈ నెల 16 నుంచి 21 మధ్య ‘యోనో’ ద్వారా జరిపే కొనుగోళ్లపై పది శాతం రాయితీ, క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. దాదాపు 85 శాతం ఈ-కామర్స్ సంస్థలు యోనోతో ఒప్పందం కుదుర్చుకున్నాయని, అమెజాన్‌, జబాంగ్‌, మింత్రా, క్యారట్‌లేన్‌, పెప్పర్ ఫ్రై, ఓయో, యాత్ర, ఈజ్‌మైట్రిప్‌, ఫస్ట్‌క్రై, ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్‌ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయని వివరించింది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గిఫ్ట్, నగలు, ట్రావెల్, ఫర్నిచర్, హాస్పిటాలిటీ రంగంలో పలు ఆఫర్లు ఉన్నట్టు ఎస్‌బీఐ…

readMore