సొంత ఇంటికే కన్నం వేసిన కోడలు.. గుంటూరు జిల్లాలో భారీ దోపిడీ వెనక ఉన్నది కోడలే..

తేల్చేసిన పోలీసులు! టీవీ సీరియళ్ల ప్రభావంతో దోపిడీకి స్కెచ్ బంధువులతో కలిసి సొంత ఇంట్లో భారీ దోపిడీ ప్లాన్ అబద్ధాలతో పట్టుబడిన కోడలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరులోని ఓ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అత్తా కోడళ్లను కట్టేసి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని పట్టపగలే దొంగలు దోచుకెళ్లారు. థ్రిల్లర్ సినిమాను తలపించేలా జరిగిన ఈ దోపిడీని సవాలుగా తీసుకున్న పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ మొత్తం వ్యవహారం వెనక కోడలు స్కెచ్ ఉందని నిర్ధారణకు వచ్చారు. టీవీ సీరియళ్ల ప్రభావంతోనే దోపిడీకి కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఉదయం 11 గంటల సమయంలో దర్జాగా ఇంట్లోకి వచ్చి అంత మొత్తం నగదు, బంగారాన్ని దోచుకెళ్లడం అన్నది…

ఇంకా ఉంది

కొత్త రాష్ట్రానికి మేలు చేయమని అల్లాను వేడుకున్నా: సీఎం చంద్రబాబు

ఉర్దూ భాషలో రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన బాబు ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత మాదే పన్నెండు లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం ఈరోజు రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు ఉర్దూ భాషలో సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కొత్త రాష్ట్రానికి మేలు చేయమని అల్లాను వేడుకున్నానని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇమామ్ లకు, మౌజమ్ లకు వరుసగా ఐదువేలు, మూడువేల రూపాయల చొప్పున పారితోషికంగా ఇస్తున్నామని చెప్పారు. వాళ్లు రాత్రింబవళ్లు పనిచేస్తారు కనుక వాళ్ల జీవితాలకు కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేరే రాష్ట్రాల్లో తామిస్తున్న విధంగా ఇవ్వడం…

ఇంకా ఉంది

స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి టీడీపీనే కారణం: కన్నా లక్ష్మీనారాయణ

కేంద్రం ఇచ్చిన ఆర్డర్ లో ప్లాంట్ సాధ్యపడదు అని ఎక్కడా లేదు ప్లాంట్ సాధ్యం కాదని జూన్ లో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది స్టీల్ ప్లాంట్ ను తీసుకొచ్చే బాధ్యత కేంద్రానిదే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని జూన్ లో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పట్టుబట్టడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ మరోసారి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్ సంస్థలు కలసి నివేదిక అందజేస్తే… త్వరలోనే ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలలో ప్లాంట్ సాధ్యపడదు అని ఎక్కడా లేదని తెలిపారు. మోస పూరిత…

ఇంకా ఉంది

కేసీఆర్ కారు నంబ‌రును వాడేస్తున్నారు

వాడుకోవ‌డంలో మ‌న వాహ‌న‌దారుల‌ను మించిన వారుండ‌రు. ఏ కారు విడిభాగాలు ఏ కారుకు వాడ‌తారు ? ఏ బైకు నంబ‌రు ప్లేటు ఏ కారుకు భిగిస్తారో ? పోలీసులు ప‌ట్టుకుంటే కానీ అర్ధం కాదు. నిన్న గాక మొన్న ఏకంగా సూర్యాపేట సీఐ వాహ‌నాన్నే ఎత్తుకెళ్లిన ఘ‌నులను చూశాం. ఇప్పుడు ఏకంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వినియోగించే కారును అనేక మంది అనేక కార్ల‌కు వినియోగిస్తున్న‌ట్లు తాజాగా బ‌య‌ట‌ప‌డింది. కేసీఆర్ కాన్వాయ్ శ్రేణిలోని వాహనాలన్నింటికీ ‘TS 09 K 6666’ అనే నంబర్ ఉంటుంది. భద్రత కోసం అలా ఒకే నంబర్ తో కూడిన ప‌లు వాహనాలను వాడుతుంటారు. కేసీఆర్ ఏ వాహ‌నంలో ఉంటారో ఎవ‌రికి తెలియ‌కుండా ఉండ‌డానికి ఈ విధంగా చేస్తారు. కేసీఆర్ కాన్వాయ్ లో రెండు టయోటా ప్రాడో, నాలుగు ఫార్చ్యూనర్ వాహనాలు ఉంటాయి. కేసీఆర్…

ఇంకా ఉంది

మన చెస్ క్వీన్ పెళ్లి చేసుకుంటోంది

తెలుగు గడ్డ వచ్చిన గొప్ప చెస్ ప్లేయర్లలో ద్రోణవల్లి హారిక ఒకరు. చిన్న వయసులోనే ప్రతిభ చాటుకుని ప్రపంచ స్థాయికి ఎదిగిందీ గుంటూరు అమ్మాయి. తనకంటే ముందు ఈ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన కోనేరు హంపికి దీటుగా ప్రదర్శన చేసి.. ఆమె కంటే ఉన్నత స్థానానికి ఎదిగింది హారిక. ఈ అమ్మాయి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 27 ఏళ్ల ఈ గ్రాండ్ మాస్టర్ ఆగస్టు 19న పెళ్లి చేసుకోబోతంది. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి కుటంబం నడుపుతున్న వ్యాపారం చూసుకుంటున్న కార్తీక్ చంద్ర అనే కుర్రాడిని హారిక వివాహమాడనుంది. అతను ఆంధ్రా ప్రాంతానికి చెందినవాడని అంటున్నారు. ఈ నెల 18న హైదరాబాద్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో హారిక-కార్తీక్ ల నిశ్చితార్థం జరగబోోతంది. హారిక 1991 జనవరి 12న గుంటూరులో జన్మించింది.…

ఇంకా ఉంది