రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా

రాష్ట్రంలో వచ్చే రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలి. అధికారులంతా స్థానికంగానే ఉండి, అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ ఎస్‌కే జోషిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు జిల్లాల్లో అందుబాటులో ఉండాల్సి ఉన్నందున సోమవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

Tags:Cabinet Meeting , CM KCR , TRS , Telangana ,

Related posts

Leave a Comment