బ్రిటీష్ మోడల్ కు మత్తుమందిచ్చి, సూట్ కేసులో కుక్కి… సెక్స్ స్లేవ్ గా అమ్మే ప్రయత్నం!

british model kidnapped dark web
  • ఇటలీలో ఫోటో షూట్ కు వెళ్లిన మోడల్ కు ఘోర అనుభవం
  • బంధించి డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టిన వ్యక్తి
  • రెండేళ్ల కుమారుడు ఉన్నాడని తెలుసుకుని విడిచిన వైనం
  • బాధితురాలి ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
  • విచారణ సందర్భంగా మొత్తం ఘటనను న్యాయమూర్తికి తెలిపిన అధికారులు

బ్రిటన్ కు చెందిన ఓ యువ మోడల్ ను ఓ కిడ్నాపర్ లైంగిక బానిసగా అమ్మే ప్రయత్నం చేయగా తాము అడ్డుకున్నామని ఇటలీ అధికారులు వెల్లడించారు. ఈ కేసు విచారణను బుధవారం నాడు ఇటలీ కోర్టు చేపట్టగా, ప్రాసిక్యూషన్ నిందితుడు చేసిన నేరాన్ని వెల్లడించింది. న్యూస్ ఏజన్సీ ‘ఏఎన్ఎస్ఏ’, ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనాల ప్రాంతంలో మిలన్ ప్రాంతంలో చోలీ ఐలింగ్ అనే 20 సంవత్సరాల యువతిని గత వేసవిలో లూకాజ్ పావెల్ హెర్బా (30) అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు.

లండన్ లో ఉండే ఆమె ఓ ఫోటో షూట్ కోసం ఇటలీకి వచ్చి, మిలన్ లోని ఓ స్టోర్ ముందు నిలబడి ఉండగా, నిందితుడు ఆమెను కిడ్నాప్ చేశాడు. అమెను సెక్స్ స్లేవ్ గా విక్రయించాలన్నది అతని ఆలోచన. ఆన్ లైన్ లో ఆమెను వేలం ద్వారా విక్రయించాలని, అందుకు డార్క్ వెబ్ (యూజర్ల వివరాలు రహస్యంగా ఉండే ఇంటర్నెట్) ను వాడుకోవాలని ప్లాన్ వేశాడు. కనీసం 3 లక్షల డాలర్ల వరకూ చోలే రేటు పలుకుతుందని అనుకున్నాడు.

తనను బలవంతంగా లాక్కెళ్లి, ఓ మత్తుమందిచ్చి ఓ బ్యాగులో కుక్కారని చోలే తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని గుర్తు చేసుకుంది. నల్లటి గ్లౌజెస్ ధరించిన ఓ వ్యక్తి తన వెనక నుంచి వచ్చి, మెడను గట్టిగా పట్టుకుని, నోరు మూశేశాడని, మరుక్షణం మరో వ్యక్తి చేతికి ఓ ఇంజక్షన్ చేశాడని చెప్పింది. తనకు మెలకువ వచ్చేసరికి కాళ్లూ చేతులూ కట్టేసున్నాయని, తాను ఓ బ్యాగులో ఉన్నానని, కారు డిక్కీలో ప్రయాణిస్తున్నానని అర్థమైందని తెలిపింది.

ఆపై టూరిన్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారని, తన చేతులు కట్టేశారని, కాళ్లను అక్కడి ఫర్నీచర్ కు కట్టేశారని పోలీసుల విచారణలో వెల్లడించింది. మళ్లీ తన కుటుంబాన్ని చూస్తానని భావించలేదని చెప్పింది. వారం రోజుల పాటు తనకు నరకాన్ని చూపారని, ఆపై తనకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడని తెలుసుకుని, తాను పనికిరానని భావించి మిలన్ లోని బ్రిటీష్ కాన్సులేట్ ముందు విడిచిపెట్టారని చెబుతూ, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 17న నిందితుడిని అరెస్ట్ చేశామని న్యాయమూర్తికి అధికారులు వివరించారు. ఈ కేసులో హెర్బా సోదరుడు మిచెల్ కొన్రాడ్ హెర్బా ను ఇంగ్లండ్ లో అరెస్ట్ చేశామని, ఆయన్ను ఇటలీకి తేవాల్సి వుందని పేర్కొన్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Tags: british model, kidnapped, dark web,Chloe Ayling, UK model, reveals

Related posts

Leave a Comment