సంజన కామెంట్ పై పాజిటివ్ గా స్పందించిన నాని!

bigboss2 contestant sanjana controversial comments on nani
  • నానిపై విమర్శలు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన
  • ఎన్టీఆర్ ఐఫోన్.. నాని చైనా ఫోన్ అంటూ వ్యాఖ్య
  • నాక్కూడా ఐఫోనే ఇష్టమన్న నాని

బిగ్ బాస్ తెలుగు సీజన్-2కు హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సీజన్-1ను హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తో పోలుస్తూ… కొందరు నానిపై విమర్శలు చేస్తున్నారు. మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్ లో నిష్క్రమించిన సంజన కూడా ఓ ఛానల్ తో మాట్లాడుతూ, నానిని విమర్శించింది. ‘ఎన్టీఆర్ ఐఫోన్ లాంటి వాడు. నాని చైనా ఫోన్. ఒక్కసారి ఐఫోన్ వాడినవారికి వేరే ఫోన్లు నచ్చవు’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై నాని ఎంతో హుందాగా స్పందించాడు. ‘నాక్కూడా ఐఫోన్ అంటేనే ఇష్టం’ అంటూ ట్వీట్ చేశాడు.

Related posts

Leave a Comment