సెమీస్‌లో సింధు, సైనా

saina nehwal badminton

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ సెమీస్‌ చేరుకున్నారు. సింధు 21-17, 21-10తో ఆకర్షి కశ్యప్‌పై, సైనా 21-17, 21-17తో శ్రియాంషిపై నెగ్గి సెమీస్‌ చేరారు. సెమీఫైనల్లో రుత్విక శివానిని సింధు, అనూరను సైనా ఢీకొంటారు. క్వార్టర్స్‌లో రుత్విక 21-14, 21-8తో సాయి ఉత్తేజితపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ కూడా సెమీస్‌ చేరారు. క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 21-17, 23-21తో శుభమ్‌ ప్రజాపతిపై, ప్రణయ్‌ 22-20, 20-19తో పారుపల్లి కశ్యప్‌పై విజయం సాధించారు. సెమీస్‌లో శ్రీకాంత్‌.. లక్ష్యసేన్‌తో, ప్రణయ్‌.. శుభాంకర్‌తో తలపడతారు. పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి-మను అత్రి, సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, నందగోపాల్‌-అల్విన్‌ జోడీలు క్వార్టర్స్‌ దాటాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి-ప్రణవ్‌ చోప్రా.. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప, రితుపర్ణ-మిథుల జోడీలు సెమీస్‌ చేరాయి.

Related posts

Leave a Comment