నా కుమారుడిని జూనియర్‌ పవర్‌ స్టార్‌ అని అనకూడదు: రేణూ దేశాయ్‌ హెచ్చరిక

Anyone commenting jr power star will be deleted by my pr assistant
  • అటువంటి ఫాలోవర్ల ఖాతాలను డిలీట్‌ చేసి, బ్లాక్‌ చేయిస్తా
  • అలా పిలవడం నా కుమారుడు అకీరాకు ఇష్టం లేదు
  • అత‌డి నాన్నకు, అమ్మనైన నాకు కూడా ఇష్టం లేదు

‘నా క్యూటీ చూడటానికి యురోపియన్‌ సినిమాలోని ఓ సీరియస్‌ క్యారెక్టర్‌లా ఉన్నాడు’ అంటూ సినీన‌టి, ప్రొడ్యూస‌ర్ రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో త‌న‌ కుమారుడు అకీరా ఫొటో పోస్ట్ చేసింది. ఓ గేమ్‌ కోసం తన ల్యాప్‌టాప్‌లో ఆసక్తిగా వెతుకుతున్నాడని ఆమె పేర్కొంది. అయితే, ఎవరైనా త‌న కుమారుడిని జూనియర్ పవర్ స్టార్‌ అంటూ కామెంట్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా ఖాతాలను తన ఫాలోవర్ల లిస్టు నుంచి డిలీట్‌ చేయించి, బ్లాక్‌ చేయిస్తానని హెచ్చ‌రించింది. తన అసిస్టెంట్‌కి ఈ విధంగా చేయమని చెబుతానని తెలిపింది.

అలా పిలవడం త‌న కుమారుడు అకీరాకు, అలాగే అత‌డి నాన్నకు, అమ్మనైన త‌నకు ఇష్టం లేదని ఆమె తెలిపింది. ఫాలోవ‌ర్లు అలా అనడం ఆపాల‌ని హెచ్చ‌రించింది. కాగా, సోష‌ల్ మీడియాలో త‌న పిల్ల‌ల గురించి అధికంగా పోస్టులు చేసే రేణూ దేశాయ్ ఒక్కోసారి భావోద్వేగ పూరితంగా క‌విత‌లు రాస్తుంటుంది. తాజాగా ఆమె మ‌రోసారి ఇలాంటి పోస్టు చేయ‌డం ప‌ట్ల ఆమె ఫాలోవ‌ర్లలో కొంద‌రు ఇలా అన‌డం స‌రికాద‌ని అంటుండగా, మ‌రి కొంద‌రు స‌రిగ్గా చెప్పార‌ని ప్ర‌శంసిస్తున్నారు.

Related posts

Leave a Comment