అనసూయ ఫోన్ పగలగొట్టడాన్ని చూశానన్న యువకుడు…

anchor, anasuya, destroy, fan, mobile, phone
  • వివరాలు చెప్పాలని కోరిన పోలీసులు!
  • అనసూయ ఫోన్ పగలగొట్టినట్టు ఆరోపణలు
  • ఆరోపణలను ఖండించిన అనసూయ
  • తాను చూశానని చెప్పిన ఓ యువకుడు
  • వివరాలు సేకరిస్తున్నామన్న పోలీసులు

హైదరాబాద్ లోని తార్నాక సమీపంలో నటి, యాంకర్ అనసూయను చూసిన ఆనందంలో తన కుమారుడు సెల్ఫీకి ప్రయత్నించగా, తీవ్ర ఆగ్రహంతో అనసూయ ఫోన్ పగలగొట్టినట్టు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అనసూయ సైతం స్పందిస్తూ, సెల్ఫీ దిగే పరిస్థితుల్లో తాను లేనని, వెళ్లిపోవాలని వారికి చెప్పి కారులోకి ఎక్కానని, ఫోన్ పగిలిందా? లేదా? అన్న విషయం తనకు తెలియదని చెప్పింది.

ఇక, ఓ యువకుడు అనసూయను, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ, బాలుడి ఫోన్ ను ఎందుకు పగలగొట్టావు? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించి కలకలం రేపాడు. ఆ సమయంలో తాను అక్కడే ఉండి ఘటనను చూశానని చెప్పాడు. హైదరాబాద్ పోలీసులు సైతం అతని ట్వీట్ పై స్పందించి, పూర్తి వివరాలు చెప్పాలని రిప్లయ్ ఇచ్చారు. సదరు యువకుడి నుంచి సమాచారాన్ని సేకరిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Tags: anchor, anasuya, destroy, fan, mobile, phone

Related posts

Leave a Comment