‘రంగస్థలం’ లో అనసూయ పాత్ర ఏంటో తెలుసా !

Anasuya New Look From Rangasthalam1985 Movie

1985లో జరిగే అచ్చమైన పల్లెటూరి ప్రేమకథగా తెరకేక్కబోతున్న సినిమా ‘రంగస్థలం1985’. ఇందులో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. వారితో పాటు నటి, యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.

ఇంతకీ ఆమెది ఏ పాత్ర అనుకుంటున్నారా.. మేనత్త పాత్రట. అవును అనసూయ చరణ్ కు మేనత్తగా కనిపిస్తుందని చిత్ర సన్నిహిత వర్గాల టాక్.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపు రాజమండ్రిలో ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tags: Rancharan, rangastalam 1985 movei, anchor anasuya, charector

 

Related posts

Leave a Comment