తెలుగు రాష్ట్రాల్లో ‘అజ్ఞాతవాసి’ తొలిరోజు వసూళ్లు ఇవిగో!

agnathavasi movie Review and rating
  • ఈ నెల 10న విడుదలైన ‘అజ్ఞాతవాసి’
  • అన్ని ప్రాంతాల్లో భారీ ఓపెనింగ్స్
  • చిరూ రికార్డును అధిగమించింది

త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్ కి గల క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్లో రూపొందిన ‘అజ్ఞాతవాసి’ ఈ నెల 10వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.

ఏరియాల వారీగా చూసుకుంటే, నైజామ్ లో 5.45 కోట్లు .. సీడెడ్ లో 3.35 కోట్లు .. నెల్లూరులో 1.64 కోట్లు .. గుంటూరులో 3.78 కోట్లు .. కృష్ణాలో 1.83 కోట్లు .. వెస్ట్ 3.70 కోట్లు .. ఈస్ట్ 2.85 కోట్లు .. ఉత్తరాంధ్ర 4.30 కోట్లు .. ఇలా ఈ సినిమా తొలిరోజున 26.93 కోట్లను రాబట్టింది. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తొలి రోజున 23.30 కోట్లను వసూలు చేసి, ‘బాహుబలి 2’ తరువాత స్థానంలో నిలబడింది. తాజాగా ఈ రికార్డును ‘అజ్ఞాతవాసి’ అధిగమించడం విశేషం. ఈ రోజున బాలకృష్ణ ‘జైసింహా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టాక్ ‘అజ్ఞాతవాసి’ వసూళ్లపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందో చూడాలి.

Related posts

Leave a Comment