నా భార్యతో తమ్ముడికి పెళ్లిచేయండి…ఆత్మహత్య చేసుకుని యువకుడు లేఖ!

suicide
  •  సోమవారం వివాహం చేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకున్న యువకుడు లేఖ!
  • పెళ్లై రోజు గడవకుండానే ఆత్మహత్య
  • అక్క కూతురితో వివాహం ఇష్టం లేనందునే
  • కర్ణాటకలో ఘటన

సోమవారం నాడు వివాహం చేసుకుని, 24 గంటలు గడవకుండానే ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు తన భార్యను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని లేఖ రాసిన ఘటన కర్ణాటకలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో మునిరాజు (30) అనే యువకుడికి, ఆయన అక్క కూతురితో బంధుమిత్రులు వైభవంగా పెళ్లి జరిపించారు.

వివాహం తరువాత ఇంటికి వచ్చిన దంపతులను తొలిరాత్రి నిమిత్తం గదిలోకి పంపారు. ఆ సమయంలో భార్యతో అంటీముట్టనట్టుగానే ఉన్న మునిరాజు, తెల్లవారుజామున ఫ్యానుకు ఉరేసుకుని మరణించాడు. అంతకుముందు అతనో లేఖ రాశాడు. అక్క కూతురిని చేసుకోవడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశాడు. పెద్దల బలవంతం మీదనే పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. తన తమ్ముడికి ఆమెను ఇచ్చి మళ్లీ పెళ్లి చేయాలని సూచించాడు. మునిరాజు ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన రాసిన లేఖను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Tags: brother,sister in law, marriage,suicide,chikballapur,muniraju,sulikunte village

Related posts

Leave a Comment