6 నెలల్లో 75 కార్యక్రమాలు.. చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ

  • యూనివర్శిటీల్లో అన్ని జిల్లాల విద్యార్థులతో భేటీ 
  • నాయకులపై ప్రతి 45 రోజులకు ఒకసారి అభిప్రాయ సేకరణ
  • ఎంపీలు క్షేత్ర స్థాయిలో కూడా పోరాడాలి

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో, చంద్రబాబు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. రానున్న 6 నెలల కాలంలో 75 కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన తెలిపారు. యూనివర్శిటీల్లో ఉన్న 13 జిల్లాల విద్యార్థులతో భేటీ అవుతానని చెప్పారు. సేవా మిత్రలు, సాధికార మిత్రలతో ముఖాముఖి మాట్లాడతానని తెలిపారు. నాయకులపై కార్యకర్తలకు ఉన్న అభిప్రాయాన్ని ప్రతి 45 రోజులకు ఒకసారి సేకరిస్తామని చెప్పారు. ప్రతి నాయకుడు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరితో సత్సంబంధాలను కొనసాగించాలని ఆదేశించారు. అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ వివరాలను వెల్లడించారు.

విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చకపోవడంపై టీడీపీ ఎంపీలు క్షేత్ర స్థాయిలో పోరాడాలని చంద్రబాబు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒక కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించాలని చెప్పారు. విశాఖ రైల్వే జోన్, పెట్రో కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై పోరాడాలని తెలిపారు. ఢిల్లీలో ఆందోళనలు కూడా చేపట్టాలని సూచించారు.

Related posts

Leave a Comment