ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బయోపిక్.. పూర్తి కావొస్తున్న షూటింగ్!

  • వివరాలు వెల్లడించిన చిత్ర యూనిట్
  • చంద్రబాబు పాత్రలో వినోద్ నువ్వుల
  • విద్యార్థి నేత నుంచి సీఎం వరకూ చిత్రీకరణ

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. క్రీడాకారుల నుంచి సినీస్టార్ల వరకూ అందరూ తమ జీవితాల్లోని మంచి చెడులను సమానంగా చూపడంతో ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో వినోద్ నువ్వుల, ఎన్టీఆర్ గా భాస్కర్ నటిస్తున్నారు.

ఓ నిరుపేద సామాన్య కుటుంబంలో జన్మించిన చంద్రబాబు తొలుత విద్యార్థి నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా.. చివరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాకు వెంకటరమణ దర్శకత్వం వహిస్తుండగా.. జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా దర్శకుడు వెంకట రమణ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో 23 ఏళ్లు పూర్తయ్యాయని వెల్లడించాడు. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను విస్మరించలేమన్నాడు. ఈ సినిమాకు రాజ్ కిరణ్ పి.ఆర్ సంగీతం అందిస్తున్నారు.
Tags:విద్యార్థి నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రి,chandra babu naidu Bio pics,updates, vinod nuvvula,ntr,venkata ramana

Related posts

Leave a Comment