3 సెప్టెంబర్ 2018 సోమవారం మీ రాశి ఫలాలు

మేషం

ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో గానీ, దగ్గరి బంధువులతో గానీ వివాదం జరగడం లేదా వారు మిమ్ముల్ని అపార్థం చేసుకోవడం జరగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం

మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా వేడుకలో లేదా ఉత్సవంలో పాల్గొంటారు. పోటీల్లో గెలుపొందుతారు లేదా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ప్రేమను వ్యక్త పరచడం, ఇష్టమైన వ్యక్తులను కలవడం కానీ చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తికి సంబంధించిన ప్రయాణాలు చేస్తారు.

మిథునం

వాయిదా పడుతున్న పనులు ఈరోజు పూర్తి చేయడానికి అనుకూల సమయం. పై అధికారులను కలవడానికి, ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు, ప్రశంసలు పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

కర్కాటకం

రోజువారి పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులు లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

సింహం

ఈరోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనస్సు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఖర్చులు అధికంగా ఉంటాయి.

కన్య

ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవడానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవడానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనుకూలమైన రోజు. పిల్లల ఆరోగ్య విషయం లేదా విద్యా విషయంలో కొంత ఆందోళన చెందుతారు.

తుల

ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవడానికి అనుకూల దినం. మీ మా ట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థికంగా లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

వృశ్చికం

మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పడానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది.

ధనుస్సు

మీ ఇంటికి సంబంధించిన పనులు చేయడానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణంలో కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది.

మకరం

ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహ సంబంధాలు మెరుగుపడుతాయి. వివాదాలు సమసిపోతాయి. నూతన వస్ర్తాలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

కుంభం

ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాత బాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడడంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూర బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

మీనం

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

Tags: Horoscope , Daily Horoscope , 3 September 2018 Monday Horoscope

Related posts

Leave a Comment