36 రోజుల తరువాత స్వల్పంగా పెరిగిన పెట్రోలు ధర!… తాజా ధరలివి!

గత 36 రోజుల్లో 22 సార్లు తగ్గిన ధర
నేడు 16 పైసలు పెరిగిన పెట్రోలు రేటు
12 పైసల వరకూ పెరిగిన డీజెల్ ధర
దాదాపు నెల రోజులకు పైగా తగ్గుతూ వచ్చిన పెట్రోలు, డీజెల్ ధరలు నేడు పెరిగాయి. గడచిన 36 రోజుల్లో 22 సార్లు తగ్గిన పెట్రోలు ధర నేడు 16 నుంచి 17 పైసల వరకూ పెరిగింది. డీజెల్ ధరను 10 నుంచి 12 పైసల మేరకు పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. నేడు సవరించిన ధరల తరువాత ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 75.71గా ఉండగా, ముంబైలో రూ. 83.10, చెన్నైలో రూ. 78.57, కోల్ కతాలో రూ. 78.39గా ఉంది. ఇదే సమయంలో డీజెల్ ధర ఢిల్లీలో రూ. 67.50గా ఉండగా, ముంబైలో రూ. 71.62, కోల్ కతాలో రూ. 80.50, చెన్నైలో రూ. 71.24గా ఉంది.

Related posts

Leave a Comment