సప్త స్వరాలు పలికే బండరాయి… తమిళనాడులో దొరికింది!

  • రెండు టన్నుల బరువున్న రాయి
  • కృష్ణగిరి చరిత్రను పరిశోధిస్తుండగా లభ్యం
  • 2,500 ఏళ్ల నాటిదంటున్న పురావస్తు అధికారులు

అది మామూలు రాయి కాదు… రాగాలు పలికించే రాయి. చిన్నా చితకదీ కాదు. దాదాపు రెండు టన్నుల బరువుంది. 4 అడుగుల వెడల్పుతో, మూడు అడుగుల ఎత్తుతో సప్త స్వరాలనూ పలికిస్తోంది. తమిళనాడులోని అంజెట్టి సమీపంలో దాదాపు 2,500 ఏళ్ల నాటిదిగా భావిస్తున్న ఈ రాయి, కృష్ణగిరి జిల్లా చరిత్రను పరిశోధిస్తున్న పరంధామన్, అన్బరసన్ తదితరులు కనుగొన్నారు. అంజెట్టి సమీపంలో పరిశోధనలు సాగిస్తుండగా, ఇది కనిపించింది. ఓ 30 టన్నుల బరువున్న బండరాయిపై దీన్ని గుర్తించామని పురావస్తు శాఖ పరిశోధకులు వెల్లడించారు.

Related posts

Leave a Comment