టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోండి: షబ్బీర్ అలీ డిమాండ్

పార్టీ ఫిరాయించిన దామోదర్ పై చర్యలు తీసుకోవాలి సాక్ష్యాధారాలను స్వామిగౌడ్ కు అందజేస్తాం కేసీఆర్ క్రెడిబిలిటీ ఏమిటో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. దామోదర్ పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన సాక్ష్యాధారాలను శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు అందించబోతున్నామని చెప్పారు. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గతంలో కేసీఆర్ టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుదారులపై తాము ఫిర్యాదు ఇస్తే పట్టించుకోని స్వామిగౌడ్… ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే… టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన…

readMore

ప్రతీ బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు ఇంకా ఎందుకు వేయలేదంటే?: క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

డబ్బు వేసేందుకు మరింత సమయం పడుతుంది కేంద్రం దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు ఆర్బీఐని అడిగితే సహకరించడం లేదు అధికారంలోకి వస్తే ప్రతీఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచి పెడతామని వ్యాఖ్యానించారు. అయితే ఈ హామీపై ప్రతిపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే స్పందించారు. ప్రతీ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేయడానికి ఇంకా సమయం పడుతుందని మంత్రి అథావలే తెలిపారు. ప్రజలకు ఒక్కసారిగా ఇవ్వడానికి అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని వ్యాఖ్యానించారు. సాయం చేయాలని రిజర్వు బ్యాంకును కోరినా సానుకూలంగా స్పందించలేదని వాపోయారు.ఒకవేళ అంత మొత్తంలో…

readMore

ప్రియులతో కలిసి భర్తను వేధించిన మహిళ.. టార్చర్ తట్టుకోలేక కరెంట్ వైర్లు పట్టుకుని భర్త ఆత్మహత్య!

గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన ముగ్గురు ప్రియులతో భార్య అక్రమ సంబంధం కేసు నమోదుచేసిన పోలీసులు వివాహ బంధాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది. పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియులతో కలిసి భర్తను వేధించింది. చివరికి ఈ టార్చర్ హద్దు దాటడంతో బాధితుడు కరెంట్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్ లోని రాజ్ కోట్ నగరంలో చోటుచేసుకోంది. రాజ్ కోట్ లోని గంధీరామ్ ప్రాంతంలో ప్రహ్లాద్, ధన్బాయి మహేశ్వరి దంపతులు ఉంటున్నారు. అయితే నర్సింహ్, రవిశంకర్, మహేశ్ లతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహేశ్వరి భర్తను వేధించసాగింది. ఆమెకు ముగ్గురు ప్రియులు తోడయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రహ్లాద్, కరెంట్ వైర్లు పట్టుకున్నాడు. తీవ్ర విద్యుతాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. రంగంలోకి…

readMore

రాహుల్ గాంధీని బఫూన్ అనడంలో తప్పేమీలేదు!

టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బఫూన్ అనడంలో తప్పేమీలేదని ఎంపీ కవిత తెలిపారు. ప్రతిపక్ష నేత పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించి దేశ ప్రధానిని ఎలా హత్తుకున్నరో దేశ ప్రజలంతా చూశారు. సిల్లీగా ప్రవర్తించే వారిని బఫూన్ అనే అంటారని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీల మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. మా ఎజెండా ప్రజల కోసం పనిచేయడమే.. రాజకీయ పార్టీల కోసం కాదు. దేశంలో అనేక రాజకీయ కూటములున్నాయి.. కొన్ని విజయం సాధించాయ‌ని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచడంలో ఘోరంగా విఫలమైంది. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తటస్థ కూటమి ఏర్పాటు కావాల్సిన సమయం వచ్చింది. రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే రాజకీయ కూటమిలో…

readMore

సిరిసిల్లలో కేటీఆర్ కు ఘన స్వాగతం..పూల వర్షం కురిపించిన టీఆర్ఎస్ శ్రేణులు

నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల అఖండ మెజార్టీతో నన్ను గెలిపించారు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సిరిసిల్లలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారిగా సిరిసిల్లకు విచ్చేసిన ఆయన రోడ్ షో లో పాల్గొన్నారు. సిరిసిల్ల చేరుకున్న కేటీఆర్.. తొలుత నేతన్న, అంబేద్కర్, గాంధీ మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేశారు. రోడ్ షో లో పాల్గొన్న కేటీఆర్ పై కార్యకర్తలు, నాయకులు పూల వర్షం కురిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు జన్మనిచ్చింది కన్న తల్లే కానీ, రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్ల అని ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తనకు స్వాగతం పలికిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లందరికీ తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తనకు అఖండ మెజార్టీతో తనను…

readMore