కాకినాడకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాన్

సోమవారం ఉదయం తూర్పుగోదారి, పచ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుననయి. తూర్పు గోదావరి, పచ్చిమ గోదావరి జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు గంటకు 110 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది. అరటి రైతులు, ఉద్యానవన రైతులు జాగ్రత్తల్లో ఉండాలి. వరి, జొన్న, తదితర ధాన్యాలను కోసినవారు వాటిని తక్షణం గోదాముల్లో భద్రపరచాలి. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ పట్టలు కప్పి భధ్రపరచాలని సూచించారు. గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉన్న నివాసముంటున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలి. లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణం సురక్షిత…

readMore

కాంగ్రెస్ నేతలపై టీటీడీపీ గుస్సా

తెలుగుదేశం తెలంగాణ శాఖలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంపై ఒకింత ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ముందస్తు ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు బెడిసికొట్టడంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. ఎన్నికల ఫలితాలు వచ్చి సర్కారు ఏర్పడ్డా, పార్టీని నైరాశ్యాన్ని వీడకపోవడంపై రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ నాయకత్వం తమ అవసరాల కోసమే తెలంగాణ శాఖను బలిచేసిందనే విమర్శలు వస్తు న్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసమే తెలంగాణ శాఖ నేతలు, కార్యకర్తల భవిష్యత్‌ను పణంగా పెడతారా ? అంటూ ఆగ్రహం పెల్లుబుకుతున్నది. మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలో వెళ్లినప్పటికీ, కాంగ్రెస్‌లో సరైన ప్రణాళిక లేక చతికిలపడ్డామని అంటున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనలోనూ, అభ్యర్థులను ప్రకటిం చడంలోనూ చోటుచేసుకున్న జాప్యం మరో ఐదేండ్ల పాటు అధికారానికి దూరంగా ఉండేలా చేసిందని, తీవ్ర మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.…

readMore

ఇక టీఆర్‌ఎస్‌ పంచాయితీలపై గురి

బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం విద్యావంతులైన నిరుద్యోగులు ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 12 లక్షల మంది రుణాల కోసం బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే గత నాలుగున్నర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయాం టలో కేవలం 1.13లక్షల మందికి మాత్రమే రుణాలు అందజేశారు. మిగతా వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం తప్పా ఎవరికీ రుణాలు ఇవ్వలేదు. కనీసం ఈ కొత్త ప్రభుత్వంలోనైనా అర్హులైన బీసీలందరికీ రుణాలు అందజేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులందరికీ రుణాలు అందించేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఈ నెలాఖరులోపు గతంలో ఎంపికైన వారందరికీ సబ్సిడీ రుణాలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో సుమారు 40వేల మంది లబ్దిదారులకు రుణాలు అందే అవకాశం ఉంది.జనవరిలో జరుగనున్న…

readMore

ఆందోళనకు గురి చేస్తున్నబాలికల అదృశ్యం కేసులు

ఆడాంబరంగా తమ ఆడపిళ్లలకు పెళ్లిళ్లు చేద్దాం అనుకుంటున్న తల్లిదండ్రుల ఆశలు నిరాశలు చేస్తున్నారు. కొంత మంది అమ్మాయిలు కడుపుల్లో పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచిన పెద్దలకు కనీసం పేగు మమకారాన్ని సైతం లెక్కచేయకుండా రెక్కలోచ్చిన పక్షిలాగా ఎగిరిపోతున్నారు. ఇంట్లో వారికి చెప్పకుండా వెళ్లిపోతూ కనీళ్లు మిగిలిస్తున్న బాలికల అదృశ్యం కేసులు నగర శివారు పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. పలు పోలీసు స్టేషన్లో రోజుకు 5 నుంచి6 కేసులు నమోదు అవుతున్నాయంటే అదృశ్యం కేసుల తీవ్రత పెరిగిందని పోలీసులు భావిస్తున్న ఈ సమస్యకు ఎలా అడ్డుకట్టవేయాలో తెలియడం లేదంటున్నారు. పలువురు అధికారులు, కొన్ని సందర్భాలలో కేవలం సెల్‌ఫోన్ల వలనే ఈ ఘటనలు పెరుగుతున్నాయని భావిస్తున్న పోలీసు అధికారులు టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలకు అవసరం లేకున్న ఫోన్లు ఇవ్వడం వలనే ఈ పరిస్థ్దితులు దాపురించాయని అధికారులు…

readMore

డిసెంబ‌ర్ 18న అంత‌రిక్షం 9000 కేఎంపీహెచ్ ప్రీ రిలీజ్ వేడుక‌..రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 . ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. డిసెంబ‌ర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దీనికి ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు. అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో అంత‌రిక్షం 9000 సినిమాను తెర‌కెక్కించారు సంక‌ల్ప్ రెడ్డి. తాజాగా విడుద‌లైన ఆడియో.. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. వ‌రుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ విఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్…

readMore