ఉత్తరాంధ్రలో పట్టు కోసం ఆ నలుగురు రి ప్రయత్నాలు

పాలిటిక్స్‌లో కావాల్సింది.. ప్ర‌జ‌ల అభిమానం సంపాదించడం. ప్ర‌జ‌ల్లో మంచి ప‌ర‌ప‌తి పొంద‌డం. ఎక్క‌డ నుంచి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నార‌నే విష‌యం క‌న్నా.. ఆ నాయ‌కుడు ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. విజ‌యం సాధిస్తాడు. అని చెప్పుకొనే రీతిలో న‌లుగురు నాయ‌కులు ఏపీలో ఉన్నారు. అయితే, వీరంతా ఇప్పుడు పార్టీల‌కు దూరంగా .. వివిధ కార ణాలతో ఆయా పార్టీలకు రాజీనామాలు స‌మ‌ర్పించి.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే, ప్ర‌జ‌ల‌పైనా.. ప్ర‌స్తుత రాజ‌కీయాల ట్రెండ్‌పైనా మాత్రం వారి ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న‌వారు కూడా ఈ న‌లుగురిలో ఉన్నారు.అయితే, ఈ న‌లుగురు .. ప్ర‌జ‌ల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేసినా దాదాపు గెలిచే స్వ‌భావం ఉన్న నాయ‌కులుగా నిజాయితీ ప‌రులుగా పేరు తెచ్చుకున్నారు. ఇక, వీరు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి…

readMore

కడపలో 3వేల ఎకరాల్లో స్టీల్ ప్లాంట్

రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష కార్యరూపం దాల్చబోతోంది. కడప ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయి, కేంద్రాన్ని కదిలించేందుకు నిరాహార దీక్షలు చేసి పోరాడినా ఫలితం లేక చివరికి ముఖ్యమంత్రే మూడు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం ముందుంచారు. అయినా కేంద్రం స్పందించలేదు. అలాగని ప్రజల ప్రయోజనాలను, మనోభావాలను పక్కన పెట్టలేక… క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో సైతం కడప జిల్లాలో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలనుకున్నారు చంద్రబాబు.మైలవరం మండలంలోని ఎం.కంబలదిన్నె గ్రామం వద్ద 3,147 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రెండు ప్రత్యేక ఎస్‌పీవీలను ఏర్పాటుచేసింది. ఈ ఉక్కుపరిశ్రమకు డిసెంబరు 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గనుల శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు.…

readMore

కేటీఆర్ అదృష్టం ..లోకేష్ కు ఎప్పుడు

రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా రాజకీయ పరంగా కొన్ని పోలికలున్నాయి. అక్కడ చంద్రబాబునాయుడు, ఇక్కడ చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రులుగా ఉన్నారు.ఇద్దరూ తమ రాజకీయ వారసులను అరంగేట్రం చేయించేశారు. కేసీఆర్ కుమారుడు కె.టి.రామారావు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా మారారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. నాలుగు సార్లు కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి 2014లో రావడంతో మంత్రి అయి ముఖ్యమైన పురపాలక, ఐటీ శాఖలను సమర్ధవంతంగానిర్వహించారు. ఈరోజే కేసీఆర్ ఆయనకు ప్రమోషన్ కూడా ఇచ్చారు. పార్టీ బాధ్యతలను కేటీఆర్ కు పూర్తిగా అప్పగించారు.ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే అక్కడ చంద్రబాబునాయుడు 2014 అధికారంలోకి రాగానే తనయుడు లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకురాలేదు. అప్పటి వరకూ వెనక నుంచి పార్టీని నడిపిస్తున్న నారా లోకేష్ ను రెండేళ్ల…

readMore

ప్రసాదంలో క్రిమిసంహారక మందు.. 11 మంది మృతి వెనక విస్తుపోయే నిజం!

గోపుర నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం ప్రసాదంలో పురుగులు మందు కలిపిన ఓ వర్గం 11 మంది మృతి.. ప్రాణాలతో పోరాడుతున్న 31 మంది భక్తులు కర్ణాటకలోని చామరాజనగర జిల్లా సుళవాడిలో శుక్రవారం విషం కలిపిన ప్రసాదం తిని 11 మంది మృతి చెందిన ఘనటలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. కిచ్చుగుత్తి గ్రామంలోని మారెమ్మ ఆలయ గోపురం శంకుస్థాపన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గోపుర శంకుస్థాపన అనంతరం పంపిణీ చేసిన ప్రసాదం తిన్న 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని మైసూరులోని కేఆర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసాదంలో క్రిమిసంహారక మందు కలవడమే కారణమని తేల్చారు. ఓ వర్గం పథకం ప్రకారం ప్రసాదంలో పురుగు మందు…

readMore

మెహ్రీన్ కి తలనొప్పిగా మారిన అడ్వాన్స్ గొడవ

తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. ఆరంభంలో వరుస విజయాలు అందుకున్న ఈ కథానాయికను ఇటీవల పరాజయాలు పలకరిస్తున్నాయి. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ‘ఎఫ్ 2’ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు సరసన ఒక సినిమా చేయడానికి మెహ్రీన్ అంగీకరించింది. ఆ తరువాత ఆ ప్రాజెక్టు నుంచి సుధీర్ బాబు తప్పుకున్నాడు. ఆ నిర్మాతలు హీరోగా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ను తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లు ఆయన జోడీగా మరో హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. మెహ్రీన్ కి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని కోరారు. అయితే తన డేట్స్ వేస్ట్ అయ్యాయనీ .. ఆ డేట్స్ కారణంగా రెండు సినిమాలు కూడా వదులుకున్నాననేది మెహ్రీన్ వాదన. దాంతో ఈ గొడవ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి .. మూవీ ఆర్టిస్ట్స్…

readMore