సినిమా రివ్యూ: 2.0

Rajnikanth 2.0 movie review and rating

రివ్యూ: 2.0 రేటింగ్‌: 4/5 బ్యానర్‌: లైకా ప్రొడక్షన్స్‌ తారాగణం: రజినికాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుధాన్షు పాండే, ఆదిల్‌ హుస్సేన్‌ తదితరులు సంగీతం: ఏ.ఆర్‌. రహమాన్‌ కూర్పు: ఆంటొని ఛాయాగ్రహణం: నిరవ్‌ షా నిర్మాతలు: ఏ. సుబాస్కరన్‌, రాజు మహాలింగం కథ, కథనం, దర్శకత్వం: శంకర్‌ విడుదల తేదీ: నవంబర్‌ 29, 2018 పెద్ద స్టార్స్‌తో కూడా మీడియం బడ్జెట్‌లో సినిమాలు తీసుకునే రోజుల్లోనే తనదైన గ్రాండ్‌ విజన్‌తో కళ్ళు చెదిరే నిర్మాణ విలువలున్న సినిమాలు అందించేవాడు శంకర్‌. ప్రస్తుతం మిగతా దర్శకులు కూడా ఆ స్థాయి గ్రాండ్‌ విజువల్స్‌ చూపించే స్థాయికి అప్‌డేట్‌ అయ్యారు కనుక తన అప్‌లోడెడ్‌ వెర్షన్‌ని చూపించడానికి ఇదే మంచి టైమ్‌. బాహుబలితో ఇండియన్‌ సినిమా మార్కెట్‌ పొటెన్షియల్‌ ఎంత అనేదానిపై ఒక అవగాహన కూడా రావడం శంకర్‌ ఎప్పట్నుంచో పెండింగ్‌లో వుంచిన ‘రోబో’ సీక్వెల్‌కి తెర లేచింది. పాటల్లో అందమైన లొకేషన్లు, ఖరీదైన సెట్లు…

readMore

నేను చెప్పిందే నిజమైంది: రేవంత్ రెడ్డి

కొడంగల్ నియోజకవర్గంలో తనను ఓడించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి రూ. 100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుందని తాను తొలి నుంచి చెబుతూనే ఉన్నానని, ప్రస్తుత తనిఖీల్లో అది నిజమైందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం, కొడంగల్ టీఆర్ఎస్ నేతల ఇంట రూ. 15 కోట్ల నగదు, రూ. 25 కోట్ల నగదు పంపిణీ స్లిప్పులు లభించాయని ఆయన అన్నారు. తనను ఓడించడం సాధ్యం కాదని తెలిసి కూడా కేసీఆర్ మొండిగా వెళుతున్నారని ఆరోపించిన ఆయన, డబ్బు దొరికిన కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

readMore

కడప ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు

కడప ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కడప ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 27న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. బుధవారం సీఎంను ఆయన నివాసంలో కలిసి రమేశ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం సహకరించకపోయినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఏపీఎండీసీతో కలిసి ముందుకు వెళ్తున్నామని, ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపితే నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని తెలిపారు. టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై ఈడీ జరుగుతున్నఈడీ దాడులు కక్షపూరితమైనవని పేర్కొన్నారు. ఈ విషయంలో కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని, ఐటీ దాడులపై న్యాయపోరాటం చేస్తామని రమేశ్ పేర్కొన్నారు.

readMore

అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని తెలిసే వెళ్లాడు: జాన్ అలెన్ స్నేహితుడు రెమ్కో

సెంటినెలీస్ తెగ ఎంత ప్రమాదకరమైనదో తెలిసే జాన్ అలెన్ చౌ అక్కడికి వెళ్లాడని, వారి గురించి ముందే అధ్యయనం చేశాడని, దురదృష్టవశాత్తు వారి చేతిలో ప్రాణాలు కోల్పోయాడని అతడి స్నేహితుడు రెమ్కో స్నోయెన్జీ తెలిపాడు. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెలీస్ తెగ భాష నేర్చుకుని వారికి మిషనరీ గురించి చెప్పేందుకు వెళ్లిన అమెరికా మిషనరీకి చెందిన జాన్ వారి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, అక్కడికి వెళ్లడానికి ముందే ఆ తెగ గురించి అన్నీ తెలుసుకున్నాడు. వారెంత ప్రమాదకారులో అర్థం చేసుకున్నాడు. పుస్తకాలు చదివాడు. ఆ తెగ గురించి అధ్యయనం చేశాడు. అండమాన్ వెళ్లాక మూడు రోజులు తనతో టచ్‌లో ఉన్నాడని, ఆ తర్వాత అతడు చనిపోయినట్టు తనకు తెలిసిందని రెమ్కో స్నోయెన్జీ వివరించాడు. సెంటినెలీస్ తెగతో ఎలా మసలుకోవాలో కొన్ని రోజులు శిక్షణ కూడా…

readMore

నాణ్యత లేని కొత్త నోట్లు… ప్రజలకు కొత్త పరేషాన్!

రెండేళ్ల క్రితం చెలామణిలోకి వచ్చిన రూ. 500, రూ. 2000 నోట్లతో పాటు, గతేడాది వచ్చి రూ. 200 సహా రూ. 50, రూ. 10 నోట్లు నాసిరకంగా ఉన్నాయని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలి దశలో వచ్చిన రూ. 2000, రూ. 500 నోట్లను డబ్బు డిపాజిట్ చేసుకునే మెషీన్లు స్వీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు వీటిని బ్యాంకుల్లో జమ చేస్తుండగా, బ్యాంకులు సైతం ఈ నోట్లను తిరిగి వ్యవస్థలోకి పంపకుండా, పక్కమబెట్టి, జారీ చేయడానికి అనువుగా లేవని తేల్చుతూ ఆర్బీఐకి పంపుతున్నాయని ఓ హిందీ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కొత్త నోట్లను ఏటీఎం సెన్సర్లు గుర్తించలేకున్నాయని తెలిపింది. వాస్తవానికి పాత రూ. 500, రూ. 1000 నోట్లు తడిచినా, నలిగినా వినియోగానికి మెరుగ్గా ఉండేవి. కొత్త నోట్లు మాత్రం అంతే స్థాయి…

readMore