భాగ్యనగరికి బారులు… టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ఆగిన ట్రాఫిక్!

దసరా కోసం స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ కు క్యూ భారీగా నిలిచిపోయిన వాహనాలు దసరా పర్వదినాల కోసం స్వస్థలాలకు తరలివెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ చేరుకునేందుకు క్యూ కట్టారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, ఒంగోలు తదితర ప్రాంతాలకు వెళ్లిన వారు, వెనక్కు వస్తుండగా, టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా విజయవాడ కాజ టోల్ ప్లాజాతో పాటు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పతంగి తదితర ప్లాజాల వద్ద ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు. టోల్ బూత్ ల సంఖ్యను పెంచినప్పటికీ, వస్తున్న వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో సమస్య తప్పలేదని టోల్ నిర్వాహకులు వెల్లడించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ దిశగా హైవే పెట్రోలింగ్ పోలీసులు పట్టించుకోలేదని ప్రజలు విమర్శలు గుప్పించారు.

readMore

టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ..పొత్తులు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో తెలంగాణ పార్టీ నేతలతో(టీటీడీపీ) భేటీ కానున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా మహాకూటమి ఏర్పాటైన నేపథ్యంలో టీడీపీ వ్యూహాలను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. మహాకూటమిలో టీడీపీ పోటీ చేయనున్న స్థానాలు, పార్టీ తరఫున ఆశావహుల పేర్లను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లాల అధ్యక్షులతో పాటు ఇతర ముఖ్య నేతలతో బాబు సమావేశం కానున్నారు. మహాకూటమిలో సీట్ల ఖరారుపై ఇంకా స్పష్టత రాని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. కాగా, ఈసారి ప్రచారానికి రావాల్సిందిగా చంద్రబాబుపై టీటీడీపీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు…

readMore

ఇండియాలో తొలిసారి… పెట్రోలు ధరను దాటేసిన డీజిల్ ధర!

ఇండియాలో తొలిసారి... పెట్రోలు ధరను దాటేసిన డీజిల్ ధర!

భువనేశ్వర్ లో చరిత్ర సృష్టించిన డీజిల్ పెట్రోలు కన్నా 12 పైసల ధర అధికం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం భారతదేశ చరిత్రలో తొలిసారిగా పెట్రోలు ధరను డీజిల్ అధిగమించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఇది జరిగింది. ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం కారణంగానే గతంలో ఎన్నడూ లేని ఈ పరిస్థితి వచ్చిందని వాహనదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. సాధారణంగా పెట్రోలు ధరతో పోలిస్తే, డీజిల్ ధర 10 శాతం వరకూ తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ, భువనేశ్వర్ లో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 80.57కాగా, డీజిల్ ధర రూ. 80.69గా ఉంది. ఆయిల్ కంపెనీలపై పట్టు కోల్పోయిన కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ఇటువంటి దయనీయ స్థితి ఏర్పడిందని ఒడిశా ఆర్థిక శాఖ మంత్రి శశిభూషణ్…

readMore

ఇప్పుడు పురుషుల వంతు..‘మెన్ టూ’ ఉద్యమం!

మహిళల చేతిలో అన్యాయానికి గురైన వారి కోసం ‘మెన్ టూ’ ‘మీటూ’కు వ్యతిరేకం కాదన్న జాగిర్దార్ వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్ ప్రస్తుతం దేశంలో ‘మీటూ’ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతోంది. వివిధ రంగాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్నారు. ఇప్పుడు ఇటువంటి తరహా ఉద్యమమే మరోటి పురుడు పోసుకుంది. అయితే, ఇది పురుషుల చేతిలో అన్యాయానికి గురైన మహిళలకు సంబంధించినది కాదు.. మహిళల చేతిలో కష్టాలు పడుతున్న పురుషులకు సంబంధించింది. దీనిపేరు ‘మెన్ టూ’ (పురుషులు కూడా). బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘క్రిస్ప్’ అనే స్పచ్ఛంద సంస్థ దీనిని తెరపైకి తీసుకొచ్చింది. ఈ సంస్థ నిర్వాహకుడైన కుమార్ జాగిర్దార్.. మరో 15 మందితో కలిసి ఆదివారం దీనిని ప్రారంభించారు. ‘మీటూ’కు ‘మెన్ టూ’ ఏమాత్రం…

readMore

మీరే ‘మీటూ’కు వ్యతిరేకంగా ఉన్నారే?: మండిపట్ట రకుల్, తాప్సి!

మీరే 'మీటూ'కు వ్యతిరేకంగా ఉన్నారే?: మండిపట్ట రకుల్, తాప్సి!

నటి భావనపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్ కుమార్ కు శుభాకాంక్షలు చెప్పిన చెన్నైకి చెందిన ప్రముఖ పాత్రికేయురాలిపై రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి, మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. భావనను వేధించిన కేసులో దిలీప్ జైలుకు కూడా వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న దీలీప్ కు ఇటీవల ఆడపిల్ల జన్మించింది. ఆయన భార్య కావ్య ప్రసవించగా, సదరు మహిళా పాత్రికేయురాలు, “లవ్లీ కపుల్ దిలీప్‌, కావ్యకు ఆడశిశువు జన్మించింది.. శుభాకాంక్షలు” అని వ్యాఖ్యానించింది. ఇక ‘మీటూ’ ఉద్యమం ఊపందుకున్న వేళ, లైంగిక వేధింపుల కేసు నిందితుడికి శుభాకాంక్షలు చెప్పడం ఏంటని మంచు లక్ష్మి ప్రశ్నించింది. హీరోయిన్లు అందరూ ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతుంటే, నువ్వు మద్దతుగా నిలవడం సిగ్గు పడాల్సిన విషయమని వ్యాఖ్యానించింది. ఇక ఇదే విషయమై తాప్సి తన…

readMore