శత్రువైనా మిగలాలి.. నేనైనా మిగలాలి: పవన్ కల్యాణ్

జనసేన కవాతు బల ప్రదర్శన కాదని… ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసే ఒక కార్యక్రమమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దాదాపు పది లక్షల మంది ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు చేశారని… తద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. నిజంగా బల ప్రదర్శన చేయాల్సి వస్తే, పరిస్థితి మరోలా ఉంటుందని…. అప్పుడు శత్రువైనా మిగలాలి లేదా తానైనా మిగలాలని అన్నారు. జనసైనికులు తనను చూడటానికో, పలావు ప్యాకెట్ కో, సారా ప్యాకెట్ కో ఆశపడి రాలేదని పవన్ చెప్పారు. దోపిడీ ప్రభుత్వాలను హెచ్చరించేందుకే వచ్చారని తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఏదో చేస్తానని చెబితే ఎలా కుదురుతుందని… అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై…

readMore

శబరిమల ఆలయం మూతపడుతుందా?

శబరిమల ఆలయం మూతపడుతుందా?

శబరిమల ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తారా? అయ్యప్ప భక్తులను ప్రస్తుతం కలవరపెడుతున్న ప్రశ్న ఇదే. వివరాల్లోకి వెళ్తే, ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈరోజు నెలవారీ పూజలు చేసే క్రమంలో ఆలయ ద్వారాలను తెరవనున్నారు. సాధారణంగా ప్రతి నెల ఐదు రోజుల పాటు భక్తులకు అయ్యప్ప దర్శనం ఉంటుంది. మరోవైపు, ఆలయంలోకి ప్రవేశించేందుకు ఇప్పటికే పలువురు మహిళలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు అనుమతి ఉండదు. పొరపాటున తెలియక ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించినా… ఆలయ సంప్రదాయాలను అనుసరించి పుణ్యాహవచనం (ఆలయ శుద్ధి) చేస్తారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహిళలను అనుమతిస్తే… ప్రతిరోజు అనేకసార్లు ఆలయాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి ఇలా చేయడం అసాధ్యం. దీంతో, ఆలయాన్ని నిరవధికంగా…

readMore

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఆరుగురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాలీ ఆటోను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద…

readMore

నల్గొండ జిల్లా రామన్నపేట్ లో ఆదర్శ శాసన సభ్యుడు యాదగిరి రెడ్డి

ఒక్కసారి సర్పంచ్ అయితే కోట్లు కూడబెట్టిన వాళ్లను చూస్తున్నాం. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తర తరాలకు తరగని సంపద దోచుకున్నోళ్లు మన కండ్ల ముందే ఉన్నారు. రాజకీయం అంటేనే డబ్బు సంపాదన అన్నట్లు బరితెగించిన లీడర్లను కూడా మనం నిత్యం ఎక్కడో ఒకచోట చూస్తేనే ఉన్నాం. పది పర్సెంట్ కమషన్ గాళ్ల వేధింపులు మనకు తెలుసు. భూకబ్జాలు, చీకటి మాఫియాలు నడిపే లీడర్ల గురించి మనకు బాగా తెలుసు. కానీ నిప్పు లాంటి వ్యక్తిని మనం చూడలేదు. కమ్యూనిస్టు నాయకుడు అంటే ఇట్ల ఉండాలె అన్నట్లుగా రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటించారు గుర్రం యాదగిరిరెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లో వరుసగా సిపిఐ తరుపున పోటీ చేసి గెలిచారు గుర్రం యాదగిరిరెడ్డి. గుర్రం యాదగిరి రెడ్డి ఏదో ఆశామాషీ లీడర్…

readMore

పిరీడ్ డ్రామా చేయనున్న మహేశ్

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పందెం కోడి 2’ * ‘ఇకపై బయోపిక్ లు చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అంటోంది కీర్తి సురేశ్. ‘మహానటి ఒక మేజిక్. మళ్లీ సావిత్రి పాత్రను చేయమన్నా అలా చేయలేను. అది అలా జరిగిపోయిందంతే. అందుకే ఆ పాత్రను మళ్లీ ముట్టుకోకూడదనుకున్నా. ఈ కారణం వల్లే ఎన్టీఆర్ బయోపిక్ చేయలేదు. అసలు ఇకపై ఏ బయోపిక్ కూడా చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని చెప్పింది కీర్తి. * ప్రస్తుతం చేస్తున్న ‘మహర్షి’ చిత్రం తర్వాత మహేశ్ బాబు తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రం పిరీడ్ డ్రామాగా రూపొందుతుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పని ప్రస్తుతం జరుగుతోంది. * విశాల్ హీరోగా నటించిన ‘పందెం కోడి 2’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది.…

readMore