‘జనసేన’ కవాతు సాంగ్ త్వరలోనే విడుదల చేస్తాం: పవన్ కల్యాణ్

తమన్ బాణీలు అద్భుతంగా ఉన్నాయి కవాతు’ సంక్పలం ప్రతిబింబించేలా రామజోగయ్య సాహిత్యం: పవన్ ట్వీట్ ఈ పాట రికార్డు చేస్తుండగా తీసిన వీడియో పోస్ట్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా జనసేన పార్టీ కవాతు పాటను రూపొందించారు. ‘పద పదపద పద మెరుపలా పద’ అంటూ సాగిన కవాతు సాంగ్ ను పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ కవాతు సాంగ్ ను విడుదల చేయనున్నామని, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అద్భుతమైన బాణీలు అందించారని చెప్పారు. ‘కవాతు’ సంకల్పాన్ని ప్రతిబింబించేలా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారని ప్రశంసించారు. ఈ పాటను రికార్డు…

readMore

టిట్లీ భీభత్సం.. 12మంది మృతి

టిట్లీ తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 12మంది మృతిచెందగా నలుగురి ఆచూకీ గల్లంతయ్యింది. ఈ సంఘటన ఒడిసాలోని గజపతి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గురువారం గజపతి జిల్లాలోని బరఘారా గ్రామానికి చెందిన గిరిజనుల పాకలు టిట్లీ తుఫాను కారణంగా నేలమట్టమయ్యాయి. దీంతో తుఫాను బారినుంచి ప్రాణాలు రక్షించుకోవటానికి 22మంది గిరిజనులు దగ్గరలో ఉన్న కొండగుహలో తలదాచుకున్నారు. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగి గుహలో ఉన్న 16మంది గిరిజనులపై పడ్డాయి. దీంతో 12మంది అక్కడిక్కడే మృతిచెందగా మరో నలుగురి ఆచూకీ గల్లంతయ్యింది. రాయగడా బ్లాక్‌ ఛైర్మన్‌ ధలేశ్వర్‌ భుయన్‌ మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడి మరణించిన 12మంది మృతదేహాలను గుర్తించామన్నారు. మరో నలుగురి ఆచూకీ లభించలేదని తెలిపారు. గ్రామం మారుమూలన ఉండటం వల్లే ఈ విషాదం ఆలస్యంగా వెలుగుచూసిందని పేర్కొన్నారు.

readMore