Professor GD Agarwal dies after 111-day fast to save Ganga

Professor GD Agarwal dies after 111-day fast to save Ganga

Dr.GD Agarwal,  former professor at the Indian Institute of Technology in Kanpur and a man who devoted his life to the cause of saving river Ganga, died today. Agarwal was on a fast-unto-death for the last 111 days. Agarwal sat on his fast to protest against the government’s alleged inaction in taking measures to make the Ganga free of pollution and free-flowing.  Prof. Agarwal died at the All India Institute of Medical Sciences in Rishikesh where he was admitted by the state police last night.Agarwal died due to a heart attack, the…

readMore

ఈసీ వేటు… ఉమ్మడి ఖమ్మంలో ఏడుగురిపై ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు!

2020 వరకూ పోటీ చేయకుండా ఆదేశాలు ఎన్నికల నిబంధనల్లో సెక్షన్ 10 ఏ ప్రకారం అనర్హులు ఉత్తర్వులు వెలువరించిన ఎన్నికల కమిషన్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడుగురిపై అనర్హత వేటు వేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వీరిలో గత ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసిన అక్కిరాల వెంకటేశ్వర్లు, పాలేరు నుంచి పోటీ చేసిన మోతె మల్లయ్య, వైరా నుంచి బరిలోకి దిగిన బచ్చల లక్ష్మయ్య ఉన్నారు. వీరితో పాటు ఇల్లెందుకు చెందిన గుగులోతు విజయ, మినపాక కు చెందిన కొమరారం సత్యనారాయణ, కొత్తగూడెంకు చెందిన పునుగోటి సంపత్ లు కూడా ఉన్నారు. వీరంతా 2020 వరకూ ఎన్నికల్లో పోటీ పడేందుకు అనర్హులని, ఎన్నికల నిబంధనల్లోని సెక్షన్ 10ఏ,…

readMore

వంగవీటి రాధాను కలిసిన విజయసాయిరెడ్డి.. సుదీర్ఘ చర్చలు!

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా మల్లాది విష్ణును నియమించడంపై ఆ పార్టీ నేత వంగవీటి రాధా మనస్తాపం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధాను బుజ్జగించే నిమిత్తం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన వద్దకు వెళ్లారు. విజయవాడలోని రాధా నివాసంలో ఆయన్ని విజయసాయి ఈరోజు కలుసుకున్నారు. రాధాతో ఏకాంతంగా సుమారు గంట సేపు చర్చలు జరిపినట్టు సమాచారం. కాగా, నియోజకవర్గ ఇన్ ఛార్జిగా మల్లాది విష్ణును నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న రాధా, వైసీపీ కార్యక్రమాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రాధాను బుజ్జగించేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు నేరుగా రాధాను ఇటీవల కలిసి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, ఫలితం లేకపోవడంతో రాధాను అనునయించేందుకు విజయసాయిరెడ్డి ఈరోజు కలిసినట్టు పార్టీ వర్గాల సమాచారం. Tags: vangaveeti…

readMore

మన ముఖ్యమంత్రి అద్భుతమైన నటుడు!: పవన్ కల్యాణ్

ప్రత్యేక హోదా’పై మాట మార్చింది నేను కాదు బాబే చంద్రబాబు చెప్పిన మాటలు ఆయనే మర్చిపోయారు! బాబు మాటలు రికార్డు చేసి చూపించినా కాదంటారు! ప్రత్యేక హోదా సాధన కోసం మొదటి నుంచి తాము పోరాడుతున్నామని, ‘హోదా కావాలి’ అనే మాటమీదనే ఉన్నామని, దానిని వ్యతిరేకించింది, మాట మార్చింది సీఎం చంద్రబాబేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, ‘మన ముఖ్యమంత్రి అద్భుతమైన నటుడు. ఆయన చెప్పిన మాటలు ఆయనే మర్చిపోయారు. ‘స్పెషల్ కేటగిరి స్టేటస్ వద్దని నేను చెప్పలేదు’ అని ఆయన (చంద్రబాబు) అంటారు. ఆయన మాటలు ఆయనకు రికార్డు చేసి చూపించినా.. సాక్ష్యం చూపించినా కూడా, ‘ఎవరో అన్నారు నేను కాదు’ అని ఆయన అంటారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.…

readMore

రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవాల్సిందేనని నిబంధన ఆధారాలు బయటపెట్టిన ఫ్రాన్స్ మీడియా కాంగ్రెస్‌కు కొత్త అస్త్రం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు బలం చేకూర్చేలా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ‘డీల్’లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవడం తప్పనిసరి అంటూ ప్రభుత్వం పెట్టిన నిబంధనకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన పత్రాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ఆన్‌లైన్ పరిశోధనాత్మక పత్రిక ‘మీడియా పార్ట్’ బయటపెట్టింది. రిలయన్స్‌ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రతిపాదించింది భారత ప్రభుత్వమేనంటూ ఇటీవల ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు బాంబు పేల్చారు. అయితే, రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలన్నది తమ సొంత నిర్ణయమేనంటూ డసో ఏవియేషన్ తేల్చి చెప్పింది. ఇప్పుడు రిలయన్స్ డిఫెన్స్‌ను తప్పనిసరిగా భాగస్వామిగా చేర్చుకోవాలంటూ ప్రభుత్వం…

readMore