Income Tax Department Raids Telangana Congress Chief’s House

The Congress condemned the raids and termed it as “political vendetta” by the ruling TRS in the state and the BJP at the centre. The Income Tax department is conducting searches at the residences of Telangana Congress working president A Revanth Reddy on Thursday. The Congress condemned the raids and termed it as “political vendetta” by the ruling TRS in the state and the BJP at the centre. A senior official of the I-T department confirmed the searches but did not reveal details such as what triggered the raids. Calls made to…

readMore

దేశవ్యాప్తంగా రేపు మెడికల్ షాపుల బంద్

ఆన్ లైన్ లో మందులు అమ్మకంపై నిరసన ఏఐఓసీడీ పిలుపు మేరకు బంద్ మద్దతిచ్చిన ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ దేశ వ్యాప్తంగా రేపు మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ లో మందులు అమ్మకం, ఈ-ఫార్మసీ విధానాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపు మేరకు రేపు మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఈ బంద్ కు ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (టీటీసీడీఏ) మద్దతు ప్రకటించింది. ఆన్ లైన్ లో మందులు విక్రయించడం డ్రగ్స్ చట్టం నిబంధనకు వ్యతిరేకమని పేర్కొన్న టీటీసీడీఏ ప్రతినిధులు, ఇరవై నాలుగు గంటల పాటు ఈ బంద్ కొనసాగనుందని, ప్రజలు నిత్యం వినియోగించే మందులను కొనుగోలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

readMore

హ్యాపీ బర్త్‌డే: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న గూగుల్ సెర్చ్ ఇంజన్

1998లో ప్రారంభించిన సర్జీ బ్రిన్‌, లారీ పేజ్‌ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వీడియో విడుదల ప్రస్తుతం 150 భాషలలో 190 దేశాల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ 20వ పుట్టిన రోజు నేడు. ఈ రోజుల్లో మనకి ఏ సందేహం వచ్చినా, ఎలాంటి సమాచారం కావాలన్నా యూజర్లకు క్షణాల్లో అందించే ‘గూగుల్ సెర్చ్ ఇంజన్’ ఆవిర్భవించి నేటికి 20 ఏళ్లు పూర్తి అయింది. 1998లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సర్జీ బ్రిన్‌, లారీ పేజ్‌లు ఈ సెర్చ్ ఇంజిన్ ని ప్రారంభించారు. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గూగుల్ డూడుల్, ఓ వీడియోను విడుదల చేసింది. కాగా, గూగుల్ ప్రస్తుతం 150 భాషలలో 190 దేశాల్లో తన సేవలని అందిస్తోంది.

readMore

పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: బోండా ఉమ ధ్వజం

చింతమనేని ప్రభాకర్‌పై ఆరోపణలు సరికావు రౌడీ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారనడంపై ఆగ్రహం ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి మహిళా అధికారిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడులు చేశారంటూ వ్యాఖ్యానించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అందులో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్‌పై పవన్ చేసిన ఆరోపణలు సరికావన్నారు. తెలుగుదేశం పార్టీ రౌడీ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తోందన్న జనసేనాని మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని ప్రతిపక్షంలో ఉండగా చేసిన రాజకీయ పోరాటాలపై పెట్టిన కేసులనే పవన్ ప్రస్తావిస్తున్నారని.. రాజకీయ నాయకుడన్నాక అలాంటి కేసులు సహజమని ఉమ పేర్కొన్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలన్నారు.

readMore

ఎవరో ఎవరి పక్కనో పడుకుంటే.. నేను సమాధానం చెప్పాలా?: పవన్ కల్యాణ్

స్టింగ్ ఆపరేషన్ చేయాలనుకుంటే ఈ రౌడీ ఎమ్మెల్యేపై చేయవచ్చు కదా చంపేస్తాడేమో అనే భయం నామీదే ఎందుకు పడుతున్నారో మీడియా సోదరులు చెప్పాలి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నిన్న జరిగిన బహిరంగసభలో జనసేన అధినేత వపన్ కల్యాణ్ మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏదైనా స్టింగ్ ఆపరేషన్ చేయాలనుకుంటే ఈ రౌడీ ఎమ్మెల్యేపై చేయవచ్చుకదా? ఈ ఆకు రౌడీ ఎమ్మెల్యేపై చేయవచ్చు కదా? అంటూ పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘అబ్బే అలాంటివేమీ చేయరు’ అంటూ ఎద్దేవా చేశారు. ఎవరో ఎవరి పక్కనో పడుకుంటే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలా? అని నిలదీశారు. ఇలాంటి వాటికి పవన్ కల్యాణ్ ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. టీఆర్పీల కోసం ఏవేవో కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రౌడీ ఎమ్మెల్యేపై ఒక్క వార్త కూడా రాయరని……

readMore