మోదీ దేశ ద్రోహానికి పాల్పడ్డారు.. సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు: రాహుల్ గాంధీ

వేల కోట్ల రాఫెల్ డీల్ ను అనిల్ అంబానీకి మోదీనే స్వయంగా అప్పగించారు నిజాలను బయటపెట్టినందుకు ఫ్రాంకోయిస్ కు ధన్యవాదాలు దేశాన్ని మోదీ మోసం చేశారు రాఫెల్ యుద్ధ విమాల ఒప్పందానికి సర్వీస్ ప్రొవైడర్ గా రిలయన్స్ డిఫెన్స్ ను ఎంపిక చేయడంలో తమ పాత్ర ఏమీ లేదని… రిలయన్స్ డిఫెన్స్ పేరును భారత ప్రభుత్వమే సూచించిందంటూ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలాండ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఢిల్లీని కుదిపేస్తున్నాయి. విపక్షాలన్నీ మోదీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలోనే రాఫెల్ అతి పెద్ద కుంభకోణమంటూ ఇప్పటికే విమర్శిస్తున్న రాహుల్… దేశాన్ని మోదీ మోసం చేశారంటూ మండిపడ్డారు. మోదీ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు…

readMore

నిమజ్జనానికి గూగుల్‌ సాయం

ఏటా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే గణేశ్‌ ఉత్సవాల్లో కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం గూగుల్‌కు ఎక్కనుంది. దీనికి సంబంధించి తొలిసారిగా ఈ ఏడాది ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్‌ అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ తెలిపారు. ట్రాఫిక్‌ డీసీపీ–1 ఎల్‌ఎస్‌ చౌహాన్‌తో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటా గణేశ్‌ నిమజ్జనం సందర్భంలో హైదరాబాద్‌ వ్యాప్తంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తుంటారు. వాహనాల నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఊరేగింపు మార్గంలో ఉన్న వాహనాలు, విగ్రహాలతో ఉన్న వాహనాలు చేరిన ప్రాంతాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఆంక్షలు, మళ్లింపుల్లో మార్పులు చేస్తుంటారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు ఉన్న ప్రధాన ఊరేగింపు మార్గంతో పాటు మరో 20 ఉపమార్గాల్లోని 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటా యి. వీటి ప్రభావం సాధారణ వాహనచోదకుల పైనా…

readMore

కాఫీ కావాలా.? కాస్త జాగ్రత్త !

ఒకప్పుడు ఇరానీ చాయ్‌కి కేరాఫ్‌గా ఉన్న సిటీలో ఇప్పుడు కాఫీ ఘుమఘుమలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. కాఫీ డేలు, కాఫీషాప్‌లు అనధికార ఆఫీసులుగా, వినోద కేంద్రాలుగా మారిపోతూ గంటల తరబడి కాలక్షేపాలకు వేదికలవుతున్నాయి. సిటీలో కాఫీ ప్రియత్వం ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఇటీవల వెలుగుచూసిన ఓ పరిశోధన కాఫీ ప్రియులైన యువతులకు పలు హెచ్చరికలు చేస్తోంది. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ రీ ప్రొడక్షన్‌ ప్రకారం… జాతీయస్థాయిలో 14శాతం మంది (దాదాపు 2.71 కోట్ల మంది) దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లోని ప్రతి ఆరుగురు జంటల్లో ఓ జంట బాధితులే. జీవనశైలి మార్పులు, ఆరోగ్య పరిస్థితులు, జన్యు పరమైన సమస్యలు వంటివి దీనికి కారణాలుగా వైద్యరంగం పేర్కొంటోంది. ఇదే క్రమంలో మనం ఇష్టంగా తాగే కాఫీ సైతం నట్టింట్లో కేర్‌…

readMore

వివాదాల్లో త్రిష.. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి

అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్‌ బుల్‌ పిట్టా.. మంచి టీజింగ్‌ సాంగ్‌ గుర్తుందా? ఆ పాట గురించి ఇప్పుడెందుకు అంటారా? సంచలన నటి త్రిష అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. వినోదానికి పోయిందో, లేక ప్రచారాన్ని కోరుకుందో గానీ, అది కాస్తా బెడిసికొట్టి ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈ అమ్మడు తరచూ విదేశాలు చుట్టొస్తున్న విషయం తెలిసిందే. అలా ఇటీవల దుబాయ్‌కు రౌండ్‌ వేసింది. అక్కడ ఒక అందమైన ఈత కొలను (స్మిమ్మింగ్‌ పూల్‌)లో చక్కగా ఈదేసింది. పనిలో పనిగా అదే కొలనులో చక్కగా విన్యాసాలు చేస్తున్న డాల్ఫిన్లను చూడగానే అమ్మడు తెగ ముచ్చట పడిపోయింది. అంతటిలో ఆగితే ఆమె త్రిష ఎందుకవతుంది. అందులో ఒక డాల్ఫిన్‌ తెగ ముద్దొచ్చేస్తుంటే, ఆగలేక దాన్ని సమీపించి పట్టుకుని ముద్దెట్టేసింది. అంతే ఆ డాల్ఫిన్‌కు కూడా త్రిషను చూడగానే…

readMore