నేడు ప్రత్యేక మీడియా సమావేశం ఆహ్వానాలు పంపిన జేసీ గట్టి సమాధానం ఇస్తారంటున్న జేసీ వర్గీయులు తమపై తీవ్ర విమర్శలు చేసిన అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై స్పందిస్తూ, పోలీసులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా, వాటిని తాను సీరియస్ గా తీసుకుంటున్నట్టు జేసీ తెలిపారు. ‘మమ్మల్ని కించపరిస్తే, నాలుక కోస్తాం’ అని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్న ఆయన, నేడు ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నానని తెలిపారు. ఈ మేరకు మీడియాకు ఆహ్వానాలు పంపారు. పోలీసు అధికారులు వారి వ్యాఖ్యల ద్వారా హద్దుమీరారని, వారికి గట్టి సమాధానాన్ని తమ నేత నేడు ఇస్తారని జేసీ వర్గీయులు అంటున్నారు. కాగా, నేటి మీడియా సమావేశంలో ప్రబోధానంద ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై తన వద్ద ఉన్న సాక్ష్యాలు చూపుతూ, పోలీసుల…
readMoreDay: September 21, 2018
కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన మాయావతి!
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ కు పెను షాకిచ్చారు. చత్తీస్ గఢ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెయ్యిస్తూ, అజిత్ జోగి నేతృత్వంలోని చత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఈ ఎనినకల్లో సీజేసీతో కలసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే 22 మంది అభ్యర్థుల పేర్లనూ ఆమె ప్రకటించారు. కాగా, చత్తీస్ గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అజిత్ జోగిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తరువాత ఆయన కొత్త పార్టీని పెట్టి, కాంగ్రెస్ ఓట్లు చీల్చగా, అదే అదనుగా బీజేపీ అధికారాన్ని ఒడిసి పట్టుకుందన్న సంగతి తెలిసిందే. “చత్తీస్ గఢ్ లో అజిత్ జోగితో పొత్తు పెట్టుకుని…
readMoreఓఎల్ఎక్స్ మోసాలపై చైర్మన్ కు విశాఖ సైబర్ పోలీసుల నోటీసులు!
ఓఎల్ఎక్స్ లో పెరుగుతున్న మోసాలు సగటున రోజుకు రెండు ఫిర్యాదులు నేడు లేదా రేపు విశాఖకు రానున్న ఓఎల్ఎక్స్ చైర్మన్ సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు, అమ్మకాల మాధ్యమ సేవలందిస్తున్న ఓఎల్ఎక్స్ లో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడంపై విశాఖ పోలీసులు దృష్టిసారించారు. కొంతమంది తమ పాత వస్తువులను విక్రయిస్తామని పేర్కొంటూ, వెబ్ సైట్ లో ప్రకటనలు ఇచ్చి, అవతలి వారిని మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో, ఓఎల్ఎక్స్ చైర్మన్ కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేసి, విచారణకు రావాలని ఆదేశించారు. సగటున రోజుకు ఈ తరహా కేసుల్లో రెండు ఫిర్యాదులు వస్తుండటంతో, వెబ్ సైట్ నిర్వాహకులను పిలిచి మాట్లాడాలని భావించిన, సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు, ఇటీవల ఢిల్లీ వెళ్లి విశాఖలో జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ, ఓఎల్ఎక్స్ చైర్మన్ కు నోటీసులు…
readMoreజార్జియాలో హీరోయిన్ రిచా చద్దాకు అవమానం!
బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా జార్జియాకు వెళ్లిన వేళ అవమానం ఎదురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె స్వయంగా తెలియజేస్తూ, పాస్ పోర్ట్ కంట్రోల్ లో ఉన్న ఓ లేడీ ఆఫీసర్, తనపై జాతి వివక్షను ప్రదర్శించిందని వాపోయింది. తన పాస్ పోర్ట్ ను టేబుల్ పైకి రెండుసార్లు విసిరేసిందని, తనకు అర్థంకాని జార్జియా భాషలో గొణుక్కుందని చెప్పింది. గట్టిగా అరుస్తూ తొందరపెట్టిందని, అటువంటి అధికారిని చూస్తూ ఆ దేశాన్ని విడిచిపెట్టడం తనకు బాధగా అనిపించిందని రిచా చద్దా తెలిపింది. ఇదే సమయంలో జార్జియాలో తనకు తారసపడిన క్యాబ్ డ్రైవర్ పై రిచా పొగడ్తల వర్షం కురిపించింది. అతను చాలా మంచి వ్యక్తని, తాము సైగల ద్వారా మాట్లాడుకున్నామని, అతని సహృదయాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పింది. కాగా, ‘ఇన్సైడ్ ఎడ్జ్’ అనే ఇండియన్-అమెరికన్ వెబ్ టెలివిజన్…
readMore