ట్రిపుల్ తలాక్ రద్దుకు ఆర్డినెన్స్

మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులివ్వడం ఇకపై శిక్షార్హం కానున్నది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో.. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017 పేరిట ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యసభ ఆమోదం పొందలేకపోవడంతో చట్టంగా మారలేదు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీనికి రాష్ట్రపతి వెంటనే ఆమోదముద్ర వేశారు. దీంతో ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత లభించడంతోపాటు వెనువెంటనే అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం మూడుసార్లు తలాక్ (తలాక్-ఏ-బిద్దత్) చెప్పి భార్యకు విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. అందుకు మూడేండ్ల జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. తక్షణ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాల్చేందుకు పార్లమెంట్‌లో తీవ్రంగా ప్రయత్నించామని, మరో మార్గంతరం లేకపోవడంతో ఈ ఆర్డినెన్స్ తీసుకురాక తప్పడం లేదని న్యాయశాఖ…

readMore

ప్రణయ్‌ కేసు: కాంగ్రెస్‌ నేతను సస్పెండ్‌ చేస్తున్నాం!

jana reddy vimalakka consoles-pranay family members జిల్లాలోని మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్‌ కుటుంబసభ్యులను పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమవారం పరామర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి ప్రణయ్‌ ఇంటికి వచ్చి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రణయ్‌ భార్య అమృతవర్షిణితో మాట్లాడారు. జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్ హత్యలో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రణయ్‌ను హత్య చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమాజంలో ఇలాంటి హత్యలు అత్యంత ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. ప్రణయ్‌ భార్య అమృతకి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. విమలక్క పరామర్శ ప్రణయ్ భార్య అమృతను, అతని…

readMore

జెట్ విమానంలో తగ్గిన క్యాబిన్ ప్రెజర్… చెవులు, ముక్కుల్లోంచి రక్తంతో తీవ్ర కలకలం!

సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ 9డబ్ల్యూ 0696 నెంబర్ విమానం గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్‌ బయలుదేరింది. అయితే విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో కొందరు ప్రయాణికులు తీవ్ర తలనొప్పికి గురవ్వడమే కాకుండా అకస్మాత్తుగా ముక్కు, చెవుల నుంచి రక్తం రావడంతో భయబ్రాంతులకు గురయ్యారు. విమాన క్యాబిన్‌లో ఎయిర్ ప్రెజర్‌ను నియంత్రించడం సిబ్బంది మర్చిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో వెంటనే అత్యవసర ఆక్సిజన్‌ మాస్క్‌లను ప్రయాణికులు ధరించాల్సివచ్చింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 166 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది చేసిన తప్పిదం వల్ల ముంబై నుంచి జైపూర్‌ వెళ్లాల్సిన విమానం కాస్తా, తిరిగి ముంబై వెళ్లాల్సివచ్చింది. ముంబై విమానాశ్రయంలో బాధిత ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా..…

readMore

డిప్రెషన్ లో ‘మహానటి’ కీర్తి సురేష్

హీరోయిన్లకు గ్లామర్ తో పాటు టాలెంట్ కూడా ముఖ్యమే. రెండింట్లో ఏది లేకపోయిన కెరీర్ ఎక్కువ కాలం కొనసాగదనే విషయం అందరికీ తెలిసిందే. గ్లామర్ ఉండి టాలెంట్ లేకపోయినా… టాలెంట్ ఉండి చక్కటి శరీర సౌష్టవాన్ని కోల్పోయినా కెరీర్ ను కొనసాగించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ పరిస్థితి కూడా ఇదే. ‘మహానటి’ సినిమాతో ఎంతో పేరు, అభిమానులను సంపాదించుకున్న కీర్తి ప్రస్తు డిప్రెషన్ లో ఉంది. ‘మహానటి’ సినిమా సూపర్ హిట్ కావడంతో కీర్తి సురేష్ కు ఆఫర్లు వెల్లువెత్తుతాయని అందరూ భావించారు. కానీ, ఊహించని విధంగా ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఎన్టీఆర్’ చిత్రం మాత్రమే ఉంది. ఈ చిత్రంలో కూడా ఆమె సావిత్రి పాత్రను పోషిస్తోంది. సినిమా అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో కీర్తి సురేష్ డిప్రెషన్ కు లోనవుతోందట. కీర్తికి…

readMore