ఔట్ సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులకు పండుగ రోజు : సీఎం కేసీఆర్

విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ల(ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) సర్వీసును క్రమబద్దీకరించడానికున్న న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోయాయి. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో విద్యుత్ శాఖలోని జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్., ఎన్.పి.డి.సి.ఎల్. సంస్థలలో పనిచేసే 23వేల మంది ఆర్టిజన్లను క్రమబద్దీకరించడానికి మార్గం సుగమమైంది. విద్యుత్ సంస్థలలో ఎంతో కాలంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విద్యుత్ శాఖ అధికారులను గతంలో ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు 23వేల మంది ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరిస్తూ గత ఏడాది నాలుగు విద్యుత్ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. ఆర్టిజన్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.ఆర్టిజన్ల క్రమబద్ధీకరణ అంశంపై…

readMore

అక్టోబర్‌లో షెడ్యూల్!

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. ముసాయిదా జాబితాకు సమయాన్ని కుదించడం, ప్రతినిత్యం జిల్లాల కలెక్టర్లు, డీఈఓలు, సంబంధిత జిల్లా పోలీస్ ఆఫీసర్లతో సమీక్షల నిర్వహణ, ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు చివరిదశకు చేరుకోవడం గమనిస్తే.. అక్టోబర్ మొదటిపక్షంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు, నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు వివిధ జిల్లాలకు ఈవీఎంలు తెప్పిస్తున్న అధికారులు.. వాటిని ఉపయోగించే విషయంలో జిల్లా రిటర్నింగ్ అధికారులకు, డీఈవోలకు శిక్షణ కార్యక్రమాలను ముమ్మరంచేశారు. ప్రధానంగా ఓటర్ల నమోదు, సవరణలకు ఈ నెల 25 వరకు గడువును కుదించి, పనులు వేగవంతం చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టింది. జాబితాలో అభ్యంతరాల స్వీకరణకు అక్టోబర్ 4 వరకు గడువు ఇచ్చింది. అనంతరం అక్టోబర్ 7న ఓటర్ల జాబితాను ముద్రిస్తారు. మరుసటిరోజు ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం…

readMore

సారిడాన్ ట్యాబ్లెట్ పై నిషేధం ఎత్తివేత!

గత వారం 328 కాంబినేషన్ డ్రగ్స్ ను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అసురక్షిత మాత్రల జాబితా కింద కేంద్ర ఆరోగ్య శాఖ ఈ 328 మందుల అమ్మకాలు, ఉత్పత్తిపై నిషేధం విధించింది. వీటిలో పెయిన్ కిల్లర్ సారిడాన్ కూడా ఉంది. అయితే, ఆ జాబితాలో ఉన్న సారిడాన్ తో పాటు మరో రెండు మాత్రలపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది. సారిడాన్ ను మార్కెట్లో అమ్ముకోవచ్చంటూ ఈరోజు తీర్పును వెలువరించింది. మన దేశంలో తలనొప్పికి సారిడాన్ ట్యాబ్లెట్ చాలా ఫేమస్. కొన్ని దశాబ్దాలుగా ఈ మాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. Tags: saridon, ban,supreme court ,328 combination , drug

readMore

ప్రబోధానంద స్వామి అసలు పేరు పెద్దన్న చౌదరి… వివరాలు ఇవిగో!

prabodhanandha swamy real name pedhanna choudary

ప్రబోధానంద స్వామి… ఏపీలో గత రెండు రోజులుగా పతాక శీర్షికలకు ఎక్కిన పేరు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొడమల గ్రామంలో ఈయన ఆశ్రమం ఉంది. వినాయక నిమజ్జనం సందర్భంగా స్వామి అనుచరులకు, స్థానికులకు మధ్య జరిగిన దాడిలో ఒకరు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులకు మద్దతుగా ఎంపీ దివాకర్ రెడ్డి తాడిపత్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. చివరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో కలుగజేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఎవరీ ప్రబోధానంద స్వామి అనే విషయం తెలుసుకుందాం. ప్రబోధానంద స్వామి అసలు పేరు పెద్దన్న చౌదరి. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం అమ్ములదిన్నె. ఆర్మీలో వైర్ లెస్ ఆపరేటర్ గా పని చేశారు. 1980లో ఆర్మీ నుంచి ఆయన బయటకు వచ్చేశారు. ఆ తర్వాత కొంత…

readMore

వంగవీటి రాధాకు వైసీపీ ముఖ్యనేతల ఫోన్.. పార్టీ మారొద్దంటూ బుజ్జగింపులు!

vangaveeti radha vijayawada

విజయవాడ సెంట్రల్ టికెట్ పై వైసీపీ అధిష్ఠానం క్లారిటీ ఇవ్వకపోవడంతో అలిగి వెళ్లిపోయిన వంగవీటి రాధాకు బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా స్పందించకుంటే తమ దారి తాము చూసుకుంటామని ఆయన వర్గీయుల హెచ్చరికల నేపథ్యంలో వైసీపీ ముఖ్య నేతలు రాధాతో సంప్రదింపులు ప్రారంభించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పార్టీ అధిష్ఠానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని, అప్పటివరకూ కొంత సంయమనం పాటించాలని కోరారు. ఈ సందర్భంగా రాధా స్పందిస్తూ.. నిన్నటి సమావేశంలో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి గట్టి పట్టున్న విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీటును తాను కోరితే.. పార్టీ నేతలేమో మచిలీపట్నం, అవనిగడ్డ, విజయవాడ ఈస్ట్ అంటూ కబుర్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయమై…

readMore