ఆంధ్ర కాంట్రాక్టర్ల బూట్లు నాకుతున్నారు: టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత శ్రావణ్ ఫైర్

T congress leader dhasoju sravan sensational comments on trs party

టీఆర్ఎస్ పై టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నేతలు ఆంధ్ర కాంట్రాక్టర్ల బూట్లు నాకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. మీకు ఆంధ్రకు చెందిన కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి కావాలి కానీ… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దా? అని ప్రశ్నించారు. హెలికాప్టర్ లో అమరావతికి వెళ్లినప్పుడు తెలంగాణ తాకట్టు గుర్తుకు రాలేదా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బదులుగా ఆయన ఈ మేరకు స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎందుకు గద్దె దించాలన్న ప్రశ్నకు ప్రతి పక్షాల వద్ద సమాధానమే లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు సమాధానంగా…. ఇదే ప్రశ్నను రాష్ట్రంలోని మేధావులు, జర్నలిస్టులు, రైతులు, నిరుద్యోగులు, ముస్లింలను అడిగితే ఎందుకు గద్దె దింపాలో చెబుతారని అన్నారు. ప్రాజెక్టుల్లో చోటు చేసుకుంటున్న భారీ అవినీతిపై కోర్టుకు వెళ్లడం కూడా…

readMore

నన్నపనేనికి ‘డిప్లోపియా’… పేపర్, టీవీ చూడాలన్నా ఇబ్బందే!

nannapaneni rajakumari suffering from diplofiaa

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అనారోగ్యం బారిన పడ్డారు. గత పదిరోజులుగా ఆమె డిప్లోపియా (ప్రతి వస్తువు రెండుగా కనిపించడం) సమస్యతో బాధపడుతూ, గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్తపోటు నియంత్రణలో లేని వారికి ఈ సమస్య తలెత్తుతుంది. కంటి నరాలు బలహీనపడతాయి. ప్రస్తుతం నన్నపనేని ఇదే సమస్యతో బాధపడుతున్నారని, ఆమెకు అధిక రక్తపోటు ఉందని, ప్రతి వస్తువూ రెండుగా కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. ఆమె కాసేపు కూడా టీవీ చూడలేకపోతున్నారు, దినపత్రికలు చదవలేకపోతున్నారు. వీటికితోడు విపరీతమైన తలనొప్పితో చూపు మసకబారింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. Tags: nannapaneni rajakumari, diplofia,television and papers,mahila commissioner

readMore

వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్.. రిప్లై ఇచ్చేందుకు ఇక స్వైప్ చేస్తే సరి!

whatsapp latest features for replay

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ కోవలోనే ఇప్పుడు మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘స్వైప్ టు రిప్లై’ పేరుతో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది. ఈ ఆప్షన్‌తో యూజర్లు మెసేజ్‌ను కుడివైపునకు స్వైప్ చేయడం ద్వారా రిప్లై ఇవ్వవచ్చు. తమకు వచ్చిన మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలనుకుంటే యూజర్లు ఇప్పటి వరకు ఆ మెసేజ్‌పై ట్యాప్ చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ బాధ తప్పినట్టే. మెసేజ్‌ను పక్కకి జరపడం ద్వారా రిప్లై ఇవ్వవచ్చు. ఐవోఎస్ యూజర్లకు ఇప్పటికే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చే పనిలో తలమునకలై ఉంది. Tags: whatsapp, latest feature, replay,swipe

readMore

సరికొత్త ఆల్ టైమ్ రికార్డుకు పెట్రోలు ధర! సామాన్యునికి లభించని ఉపశమనం!

today petrol and diesel rates

పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి సామాన్యునికి ఉపశమనం ఇప్పట్లో లభించేలా కనిపించడం లేదు. పెట్రోలు ధర సరికొత్త ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. ఈ ఉదయం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశ రాజధానిలో పెట్రోలు ధర లీటరుకు రూ. 81.91కి, డీజిల్ ధర రూ. 73.72కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు ధర ఏకంగా రూ. 89.29కి చేరగా, డీజిల్ ధర రూ. 78.26కు పెరిగింది. దేశ చరిత్రలో పెట్రోలు ధర రూ. 89ని దాటి ముందుకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల వల్లే ‘పెట్రో’ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని, డాలర్ తో మారకపు విలువలో బలహీన పడుతున్న రూపాయి కూడా ధరల పెరుగుదలకు సహకరిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్…

readMore