పోలవరం చరిత్రలో మరో మైలురాయి.. గ్యాలరీ వాక్ ను ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రుల జీవనాడి పోలవరం చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రాజెక్టు స్పిల్ వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కుటుంబసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి గ్యాలరీ వాక్ చేశారు. గ్యాలరీలో నడవడం సంక్లిష్ట ప్రక్రియ కావడంతో వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలో వైద్య బృందాలు, ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తరలించేందుకు బయట అంబులెన్సులను సిద్ధం చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసు సిబ్బందితో ఈ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా వైపు ఉన్న అడవుల్లో గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కు చెందిన వెయ్యి మంది కూంబింగ్ నిర్వహించారు. పోలవరం పరిసర ప్రాంతాలన్నింటినీ నిన్ననే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి బందోబస్తును 11…

readMore

కొండగట్టు బస్సు ప్రమాదం.. వాహనంలో 101 మంది ప్రయాణికులు?

లోయలోకి దూసుకెళ్లిన బస్సు ఒకే గ్రామానికి చెందిన 13 మంది మృతి ప్రమాదాలకు టార్గెట్లే కారణమంటున్న డ్రైవర్లు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామి ఆలయం ఘాట్ రోడ్డులో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ శ్రీనివాస్ సహా 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో శనివారం పేట గ్రామానికి చెందిన 13 మంది మృతి చెందారు. దీంతో ఈ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే ఈ ఘటనపై మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 65 మంది ఉన్నట్లు తొలుత భావించినప్పటికీ మొత్తం 101 మంది వెళుతున్నట్లు తేలింది. ఈ విషయమై స్థానికులు మాట్లాడుతూ ఆర్టీసీ తమ గ్రామాలకు తగినన్ని సర్వీసులను కేటాయించడం లేదని ఆరోపించారు. ఈ రూట్…

readMore

టేపులతో రాజయ్య రాజ‌కీయం సఫా….!?

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నా…….ముఖ్యంగా సేల్‌ఫోన్ సంభాషణలపై చాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం మాట్లాడకపోయిన సాంకేతికను అడ్డం పెట్టుకుని పరువు తీసేస్తున్న నేటి రోజులలో మరింత అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఎన్నికలలో గెలుపోటముల మాట అటుంచి పరువే పోయే పరిస్థితి వస్తుంది. దీనికి తాజా ఉదాహరణ వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ది టి. రాజయ్య ఉదంతమే. అసలే అవినీతి ఆరోపణలతో గతంలో ఉపముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్న రాజయ్య ఇప్పుడు తన సీటుకే ఎసరు తెచ్చుకుంటున్నట్లు ఉంది. ఆయన ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో ఒకటి రాజయ్య కొంప ముంచేలా ఉంది. ఈ ఆడియో సోషట్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ మహిళతో రాజయ్య సంభాషించినట్లుగా చెబుతున్న ఆడియోను అడ్డం పెట్టుకుని రాజయ్య ప్రత్యర్దులు ఆయనపై…

readMore

ట్రంప్ కంటే పెద్ద మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు!: రామ్ గోపాల్ వర్మ ఫైర్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ప్రపంచ చరిత్రలో ట్రంప్ కంటే తెలివి తక్కువ, నిజాయితీలేని నాయకుడు ఎవ్వరూ లేరని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యవహాశైలిపై వర్మ ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రపంచ దేశాలకు ఇప్పటివరకూ నాయకత్వం వహించిన నేతలందరిలోనూ డొనాల్డ్ ట్రంప్ కంటే పెద్ద మూర్ఖుడు, నిజాయితీలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను నమ్మను’ అని మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి, స్థానికులకు ఉద్యోగాల కోసమే ట్రంప్ పనిచేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరేమో.. ‘టాలీవుడ్, బాలీవుడ్ అయిపోయి ఇప్పుడు హాలీవుడ్ పై పడ్డావా నాయనా?’ అని కామెంట్లు పెడుతున్నారు. Tags:ram gopal, varma comments,us president,trumph,varma…

readMore

పచ్చని సంసారం.. భర్తతో కలసి వరినాట్లు వేసిన అఖిలప్రియ

రుద్రవరం గ్రామ సమీపంలో వరినాట్లు వేసిన నూతన దంపతులు ట్విట్టర్ ద్వారా అనుభూతిని పంచుకున్న అఖిలప్రియ ప్రజల మధ్య ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందన్న మంత్రి ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ తన భర్త భార్గవరామ్ నాయుడితో కలసి వరినాట్లు వేశారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామ సమీపంలో ఉన్న పాములేటి అనే రైతు పొలంలో నూతన దంపతులు నాట్లు వేశారు. ఈ సందర్భంగా కూలీలతో ముచ్చటిస్తూ, మంచిచెడ్డలు తెలుసుకున్నారు. ఎంత కూలీ ఇస్తున్నారని ఆరా తీశారు. ఈ ఆసక్తికర సన్నివేశాన్ని అఖిలప్రియ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ప్రజల మధ్య ఉన్నప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా అఖిలప్రియ చెప్పారు. రైతులతో మాట్లాడానని, వారి సమస్యల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. Tags: varinatlu,akhila priya,husband,rudhravaram

readMore