తెలుగు రాష్ట్రాల్లో రోడ్డెక్కిన కాంగ్రెస్, జనసేన నేతలు, పలువురి అరెస్ట్!

భారత బంద్ కు విపక్షాల మద్దతు పలు డిపోల ఎదుట నేతల బైఠాయింపు సాధారణ జనజీవనానికి ఆటంకాలు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘భారత్ బంద్’ పిలుపునకు పలు విపక్ష పార్టీలు మద్దతు పలకడంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశాయి. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద తెల్లవారుజామునుంచే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆర్టీసీ సంఘాలు సైతం బంద్ కు మద్దతు తెలపడంతో…

readMore

ప్రతిపక్ష కూటమికి రాహులే బాస్: మల్లికార్జున ఖర్గే

బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, రాహుల్ గాంధీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. నేడు కాకపోతే రేపైనా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సారథ్యాన్ని ప్రతిపక్ష కూటమి అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ పనితీరుపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దించడమే విపక్ష పార్టీల లక్ష్యమని, అయితే, కూటమిని నడిపించేదెవరన్న విషయం ఎన్నికల తర్వాత తేలుతుందన్నారు. రాహుల్‌ను నేతగా అందరూ అంగీకరిస్తున్నారని, ఆయన ఏం చెప్పినా వింటున్నారని ఖర్గే పేర్కొన్నారు. ఇటువంటి నేత ఇంకెవరికీ లేరని కితాబిచ్చారు. రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న మోదీ బృందానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి రాహులే నాయకత్వం వహిస్తారని ఖర్గే తేల్చి చెప్పారు.

readMore

సినిమానే జీవితం కాదంటున్న నాయిక :నిత్యా మీనన్

తన జీవితంలో సినిమా అనేది ఒక భాగం మాత్రమేనని అంటోంది కథానాయిక నిత్యా మీనన్. ‘నా జీవితంలో చాలా వున్నాయి. అందులో సినిమా అనేది ఒక భాగం. సినిమానే జీవితం కాదు. అందుకని వచ్చిన ప్రతి ఆఫర్ నీ ఒప్పుకోను. నేను చేయాలనుకునే పనులు చాలా వున్నాయి. వాటి సమయాన్ని బట్టి.. వీలును బట్టి సినిమాలు చేస్తుంటాను’ అని చెప్పింది నిత్య. * ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అరవింద సమేత’ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటల చిత్రీకరణ జరుపుతారు. మరోపక్క, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేస్తారు. * వివాహం తర్వాత నాగ చైతన్య, సమంత కలసి నటించే చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున మొదలవుతుంది. శివ…

readMore