మూడోసారి అసెంబ్లీ రద్దు

తెలుగు రాష్ర్టాల్లో శాసనసభలు షెడ్యూల్ ప్రకారం పూర్తికాలం పనిచేయకుండా మూడుసార్లు రద్దయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు (ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు) వివిధ కారణాలతో 7వ, 11వ శాసనసభలను రద్దుచేయాల్సిందిగా కోరడంతో నాటి గవర్నర్లు వాటిని ముందుగానే రద్దుచేశారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తొలి శాసనసభను రద్దుచేశారు. టీడీపీ స్థాపించిన తర్వాత 1983 జనవరి 9న తొలిసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీ రామారావు.. 1984 ఆగస్టు 16 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం నాదెండ్ల భాస్కర్‌రావు వల్ల తలెత్తిన రాజకీయ సంక్షోభం వల్ల ఎన్టీఆర్ సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గి మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్.. 1984 నవంబర్ 22న ఆ శాసనసభను ముందుగానే రద్దుచేసి 1985 మార్చి వరకు…

readMore

మైనర్ బాలికపై అత్యాచారం.. ఐటీ శాఖ డిప్యూటీ కమిషనర్ అరెస్ట్

భార్యకు దూరంగా ఉంటున్న డిప్యూటీ కమిషనర్ తన వద్ద పని చేస్తున్న బాలికపై అత్యాచారం అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు తన ఇంట్లో పని చేస్తున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, ముంబైలో ఐటీ శాఖ డిప్యూటి కమిషనర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తికి భార్యతో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారు విడివిడిగా ఉంటున్నారు. ఆయన వద్ద 17 ఏళ్ల ఓ బాలిక పని చేస్తోంది. తనపై డిప్యూటీ కమిషనర్ అత్యాచారం చేశాడని సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, ఆయనను అరెస్ట్ చేసి, అత్యాచారం కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.

readMore

వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్

చరణ్ కి లైన్ చెప్పిన వంశీ పైడిపల్లి బాగుందంటూ ఉత్సాహపడిన చరణ్ పూర్తి కథపై జరగనున్న కసరత్తు దర్శకుడిగా వంశీ పైడిపల్లికి ప్రత్యేకమైన స్థానం వుంది. అన్నివర్గాల వారిని థియేటర్స్ కి రప్పించేలా ఆయన కథలను రెడీ చేసుకుంటూ ఉంటాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఆయన ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. షూటింగు దశలో వున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ ను కలిసిన వంశీ పైడిపల్లి ఆయనకి ఒక లైన్ చెప్పాడట. లైన్ బాగుందనీ .. పూర్తి కథను సిద్ధం చేయమని చరణ్ చెప్పినట్టుగా సమాచారం. గతంలో ఈ కాంబినేషన్లో సూపర్ హిట్ మూవీ ‘ఎవడు’ వచ్చిన సంగతి తెలిసిందే.…

readMore

టీఆర్ఎస్‌కు టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాకున్నా.. మనపై కేసీఆర్ విమర్శలు అందుకే!: చంద్రబాబు

భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలనే యత్నం సమయం, సందర్భం లేకుండా విమర్శలు అందుకే మోదీ-షా వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు తెలంగాణలో టీఆర్ఎస్‌కు టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాకున్నా కేసీఆర్ తనను విమర్శిస్తుండడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. గురువారం రాత్రి అమరావతి సచివాలయంలో మంత్రులు, కొందరు పార్టీ ముఖ్యులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు, విలేకరుల సమావేశంలో టీడీపీపై కేసీఆర్ చేసిన విమర్శలపై ఇందులో చర్చించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అని, అయినప్పటికీ తనను తిడుతున్నారని పేర్కొన్న చంద్రబాబు.. ఇందులోనూ ఓ వ్యూహం ఉందని చెప్పుకొచ్చారు. టీడీపీని, తనను బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ యోచిస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలోనూ మోదీ-షాల వ్యూహం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.…

readMore

తెలంగాణ కోసం మళ్లీ త్యాగం

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మంచి వృద్ధిరేటును సాధిస్తున్నదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడ్డామన్న కేసీఆర్.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షాలు విచ్చలవిడి ఆరోపణలు చేస్తున్నాయని, ఇలాంటి ఆరోపణలతో తెలంగాణ అభివృద్ధి ఆగుతుందని, అధికారులను ఇబ్బందుల్లో పడేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రగతిచక్రం ఆగొద్దని, అభివృద్ధి, ఆర్థిక పెరుగుదల ఆగకూడదనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ రద్దుచేస్తూ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేసిన అనంతరం తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. కొన్నిరోజులుగా రాష్ట్రంలో రాజకీయపరంగా అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. అతి ప్రవర్తన, అసహన…

readMore