కేరళకు కొత్త సమస్య… నీటిలో జంతువుల మూత్రం కలవడంతో ‘రాట్ ఫీవర్’!

నిన్న మొన్నటి వరకూ భారీ వరదలతో అతలాకుతలమైన కేరళను నేడు మరో మహమ్మారి ‘రాట్ ఫీవర్’ రూపంలో పీడిస్తోంది. ఇప్పటికే దాదాపు 200 మందికి ఈ వ్యాధి సోకగా, ఇంతవరకూ 9 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. నీటిలో జంతువుల మూత్రం కలిసినందున బ్యాక్టీరియా ప్రబలుతుందని, ఆ నీటిలో పని చేస్తున్న వారికి ఈ వ్యాధి సోకుతుందని అధికారులు అంటున్నారు. వరద సహాయక చర్యల్లో పనిచేస్తున్న వారికి ‘రాట్ ఫీవర్’ ను నివారించే ‘డాక్సీ సెలైన్’ టాబ్లెట్లను ఇస్తున్నామని తెలిపారు. కాగా, అధిక జ్వరంతో పాటు తలనొప్పి, కండరాల నొప్పి, రక్తస్రావం, వాంతులు తదితరాలు ఈ వ్యాధి లక్షణాలని చెప్పారు. ప్రభుత్వం సైతం ‘రాట్ ఫీవర్’ బాధితుల సంఖ్య పెరుగుతుండటాన్ని గుర్తించి, ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించింది.

readMore

జోరు పెంచిన కేసీఆర్.. ఫామ్ హౌస్ లో వ్యూహ రచనలో బిజీ!

ముందస్తు ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తన ఫామ్ హౌస్ లో ముందస్తు వ్యూహ రచనలో ఆయన బిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయన హైదరాబాదు నుంచి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఇప్పటికే ముందస్తుకు సంబంధించి ఒక్కొక్క లాంఛనాన్ని పూర్తి చేస్తూ వచ్చిన కేసీఆర్… కేబినెట్ సమావేశం, అసెంబ్లీ రద్దుపై పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. 6వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశమయ్యే అవకాశం ఉంది. మరోవైపు 7న హుస్నాబాద్ లో భారీ బహిరంగసభ నిర్వహించే యోచనలో టీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రులకు కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.

readMore

దు’మా’రం… నరేష్ వి తప్పుడు ఆరోపణలు, ఎన్నికల స్టంటన్న శివాజీ రాజా!

సంచలనం రేపుతున్న మరో దుమారం నిధులు దిర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఖండిస్తున్న శివాజీరాజా వర్గం టాలీవుడ్ లో ఇప్పుడు మరో దుమారం సంచలనం రేపుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో కార్యదర్శి నరేష్, హేమ తదితరులు ఓ వైపు, అధ్యక్షుడు శివాజీ రాజా, నటుడు శ్రీకాంత్ తదితరులు మరోవైపు చేరిపోయారు. అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని ఓ ఆంగ్ల దినపత్రికలో నాలుగు రోజుల క్రితం వచ్చిన వార్తతో కలకలం మొదలైంది. దీని లోతులకు వెళ్లిన నరేష్, దుర్వినియోగం నిజమేనని, తాను నమ్మి సంతకాలు చేశానని, ఇటీవల అమెరికాలో టాలీవుడ్ రజతోత్సవ వేడుకలు జరిగిన వేళ నిధులు దారిమళ్లాయని ఆరోపించగా, దానిపై శివాజీరాజా స్పందించాడు. ‘మా’లో ఏం జరిగినా అది అందరికీ తెలిసే జరుగుతుందని, అసోసియేషన్ కు ఎన్నికలు జరిపించి, తాను…

readMore

మత సామరస్యానికి ప్రతీక… తన బిడ్డతో కృష్ణుడి వేషం వేయించిన ముస్లిం మహిళ!

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చడలో ఘటన తన బిడ్డ హయాన్ ను ముస్తాబు చేసిన శంషాద్ భానూ ప్రశంసించిన పలువురు మత సామరస్తానికి ప్రతీక అంటే, ఇంతనకన్నా గొప్ప సాక్ష్యం మరొకటి ఉండదేమో. తన చిన్నారికి శ్రీకృష్ణుడి వేషం వేయించిన ఓ ముస్లిం తల్లి మురిసిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చడ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో జరిగింది. ఇక్కడి విద్యానగర్ కాలనీలోని శంషాద్ భాను, లతీఫ్ దంపతుల బిడ్డ హయాన్, ఫస్ట్ స్టెప్ పాఠశాలలో చదువుతుండగా, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా చిన్ని కృష్ణుని అలంకరణలో స్కూలుకు వచ్చాడు. వేడుకల్లో హయాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పరమతాన్ని గౌరవించడమే నిజమైన భారతీయతని శంషాద్ భానూ చెప్పకనే చెప్పిందని పలువురు ఆమెను ప్రశంసించారు.

readMore

హైదరాబాద్ నిజాం మ్యూజియంలో ఘరానా చోరీ..

కోట్ల విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు వస్తువుల అపహరణ! హైదరాబాద్ పాతబస్తీలోని పురానా హవేలీలో ఉన్న నిజాం మ్యూజియంలో ఘరానా చోరీ జరిగింది. నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఉపయోగించిన పలు వస్తువులు అపహరణకు గురయ్యాయి. మ్యూజియం వెనుకవైపున మొదటి అంతస్తులో ఉన్న వెంటిలేటర్ ఇనుప గ్రిల్స్‌ను తొలగించిన దుండగులు తాడు సాయంతో లోపలికి ప్రవేశించారు. అనంతరం విలువైన వస్తువులను దోచుకుని వెళ్లిపోయారు. రోజూలానే సోమవారం మ్యూజియాన్ని తెరిచిన సిబ్బంది దొంగతనం విషయాన్ని గుర్తించారు. వజ్రాలు పొదిగిన దాదాపు మూడు కేజీల బరువైన బంగారు టిఫిన్ బాక్స్, వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు టీకప్పు.. సాసర్.. స్పూన్ చోరీకి గురయ్యాయి. వీటి విలువ కోట్లలో ఉంటుందని మ్యూజియం అధికారులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది…

readMore