సినిమా రివ్యూ: నీవెవరో

రివ్యూ: నీవెవరో రేటింగ్‌: 2/5 బ్యానర్‌: ఎంవివి సినిమాస్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌ తారాగణం: ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, ఆదర్శ్‌, శివాజీరాజా, తులసి, సత్యకృష్ణన్‌ తదితరులు కథ: రోహిన్‌ వెంకటేశన్‌ కథనం, మాటలు: కోన వెంకట్‌ సంగీతం: ప్రసన్‌, అచ్చు కూర్పు: ప్రదీప్‌ ఈ రాఘవ్‌ ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌ నిర్మాత: ఎం.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం: హరినాథ్‌ విడుదల తేదీ: ఆగస్ట్‌ 24, 2018 సినిమా మొత్తం ఒక మిస్టరీపై ఆధారపడి నడిచేటపుడు సస్పెన్స్‌ తెలియనివ్వకుండా కథ నడిపించడంలోనే సక్సెస్‌ వుంటుంది. మొబైల్‌లోనే వివిధ స్ట్రీమింగ్‌ యాప్స్‌లో ప్రపంచ సినిమాని మొత్తం అరచేతిలో వీక్షించేస్తోన్న నేటితరం ప్రేక్షకులకి మిస్టరీ కథలు చెప్పడం అంత తేలికైన పని కాదు. చిన్న క్లూ ఇచ్చినా ముందుకి, వెనక్కి లింక్‌ చేసేసుకుని గెస్‌ చేసేసే తెలివితేటలున్న ఈతరం ప్రేక్షకులకి అంతుచిక్కని సస్పెన్స్‌ మెయింటైన్‌ చేయాలంటే వారిని అనుక్షణం ఎంగేజ్‌ చేస్తూ, గెస్‌…

readMore

రాష్ట్రంలో వరదలకు తమిళనాడే కారణం.. కేరళ సంచలన ఆరోపణ!

150 ఏళ్ల క్రితం నిర్మించిన ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నిర్మాణం కూల్చివేసి కొత్తది నిర్మించాలని కేరళ డిమాండ్ ససేమిరా అంటున్న తమిళనాడు కేరళలో వరదలకు ప్రకృతి ప్రకోపం కారణం కాదా? అవుననే అంటోంది ఆ రాష్ట్రం. తమ రాష్ట్రంలో వరదలకు పొరుగునున్న తమిళనాడే కారణమని ఆరోపిస్తూ గురువారం కోర్టుకెక్కింది. తమ రాష్ట్రంలో ఉన్న ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా ఇడుక్కి డ్యామ్‌లో చేరిందని కేరళ పేర్కొంది. ఈ నెల 15న ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో కేరళను వరద ముంచెత్తిందని ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తమిళనాడు ప్రజలకు నీటిని అందించాలన్న ఉదాత్త లక్ష్యంతో శతాబ్దంన్నర క్రితం ముళ్ల పెరియార్ ప్రాజెక్టును కేరళలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తమిళనాడే చూసుకుంటోంది. పెరియార్ ప్రాజెక్టును…

readMore

ఉమ్మడి హైకోర్టు విభజనకు రంగం సిద్ధం.. జనవరి నుంచి వేర్వేరు కోర్టులు!

జనవరి ఒకటి నాటికి హైకోర్టు విభజన సంక్రాంతి తర్వాతి నుంచి ఏపీలో కేసుల విచారణ ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి నోటిఫికేషన్ రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా హైకోర్టు మాత్రం ఇంకా ఉమ్మడిగానే ఉంది. హైకోర్టు విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మొత్తానికి ఓ కొలిక్కి వచ్చాయి. విభజనకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. జనవరి ఒకటో తేదీ నుంచే రెండు రాష్ట్రాల హైకోర్టులు వేరవుతాయి. సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో వేర్వేరుగా పనిచేయడం ప్రారంభిస్తాయి. హైకోర్టు విభజనకు సంబంధించిన రాష్ట్రపతి నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ అంతకంటే ముందే హైకోర్టు విభజన, జోనల్ వ్యవస్థలకు ఆమోదం పొందాలని కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ గురువారం…

readMore

అమెరికా, చైనా ఢీ అంటే ఢీ.. మళ్లీ మొదలైన వాణిజ్య యుద్ధం!

సుంకాల విధింపుతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం చెరో 16 బిలియన్‌ డాలర్ల వస్తువుపై విధింపు అగర్రాజ్యాల మధ్య పెరుగుతున్న అనిశ్చితి అమెరికా, చైనాలు విశ్వ విపణిలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. సుంకాల విధింపుతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. చెరో 16 బిలియన్‌ డాలర్ల వ్యాపారంపై 25 శాతం మేరకు సుంకాల అమలుకు సిద్ధం కావడంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య అనిశ్చితి పెరుగుతోంది. చైనాకు చెందిన 16 బిలియన్‌ డాలర్ల విలువైన 279 చైనా వస్తువులపై 25 శాతం సుంకాలను వసూలు చేయనున్నట్లు యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తన వెబ్‌సైట్‌లో గురువారం పేర్కొంది. వెంటనే చైనా కూడా అదే విలువైన అమెరికా వస్తువులపై గురువారం నుంచి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీని ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఉంటుందని పరిశీలకులు…

readMore

కేంద్రానికి షాకిచ్చిన వాట్సాప్.. ప్రభుత్వం చెప్పినట్టు చేయలేమని చేతులెత్తేసిన వైనం!

ప్రభుత్వం కోరినట్టు సాఫ్ట్‌వేర్ రూపొందించలేమని స్పష్టీకరణ అలా చేస్తే వాట్సాప్ స్వభావానికి భంగం వాటిల్లుతుందన్న వాట్సాప్ ఎన్‌క్రిప్షన్‌కు విఘాతం కలిగించలేమన్న వాట్సాప్ సీఈవో మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రభుత్వానికి షాకిచ్చే ప్రకటన చేసింది. ఫేక్‌న్యూస్‌ను ఎవరు పుట్టిస్తున్నదీ తెలుసుకునే సాఫ్ట్‌వేర్ రూపొందించలేమని తేల్చి చెప్పింది. వాట్సాప్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని, ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టు సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తే దానికి విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. అది వాట్సాప్ స్వభావాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని పేర్కొంది. వాట్సాప్ దుర్వినియోగం అవుతుందన్న కారణంతో నిబంధనలను మార్చలేమని కుండబద్దలు గొట్టింది. వాట్సాప్‌పై పూర్తి విశ్వాసంతో సున్నితమైన, అత్యంత రహస్యమైన విషయాలను కూడా అందులో పంచుకుంటున్నారని, ప్రభుత్వ ఆదేశాలతో వారి నమ్మకాన్ని వమ్ము చేయలేని పేర్కొంది. వైద్యులు, బ్యాంకులు, కుటుంబ సభ్యులు అత్యంత రహస్యమైన సంభాషణలకు దానిని వినియోగించుకుంటున్నారని వాట్సాప్…

readMore