అటు.. ఇటు.. మెట్రో ‘ప్రకాశం’!

త్వరలో అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ చుక్‌ చుక్‌ మెట్రో రైలు మన నగరానికి మరింత వన్నెతెచ్చింది. ఎటువంటి ట్రాఫిక్‌ సమస్య లేకుండా ఆహ్లాదభరితమైన ప్రయాణం నగరవాసి సొంతమైంది. ఇప్పుడు త్వరలో మరో కీలక మార్గం చేరువవుతుండడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అదే ‘అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ 16 కి.మీ. మార్గం’… సెప్టెంబరు మొదటివారంలో మెట్రో రైలు ఈ మార్గంలో పరుగులు తీయనుంది. ఇప్పటికే మియాపూర్‌ నుంచి నాగోల్‌ 30 కి.మీ. మార్గం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు 16 కి.మీ.లు సైతం కలుపుకొంటే మొత్తం 46 కి.మీ. మెట్రో అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. తద్వారా దిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రోరైలు మార్గమున్న రెండో నగరంగా గుర్తింపు దక్కించుకోనుంది. అంతేకాదు మెట్రో వ్యవస్థలో చెన్నై, బెంగళూరులను అధిగమించనుంది. ఆది నుంచి హైదరాబాద్‌కు ఉన్న ప్రాముఖ్యతే దీనిని ప్రత్యేకంగా నిలుపుతోంది. దేశ రాజధాని దిల్లీ తర్వాత రెండో…

readMore

బ్రేకింగ్ న్యూస్… ముమ్మిడివరం మండలంలో గోదావరిలో పడవ బోల్తా

తూర్పు గోదావరి జిల్లాలో ఘటన 19 మందితో వెళుతున్న పడవ సహాయక చర్యలు ప్రారంభం ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో ఈ ఉదయం ఓ మరపడవ బోల్తా పడింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గుజాపులంక వద్ద ఈ ఘటన జరిగింది. పడవ నదిని దాటుతున్న సమయంలో అందులో 19 మంది వరకూ ఉన్నట్టు తెలుస్తుండగా, కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు రాగలిగారని ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ఘటనలో మృతులు ఎవరైనా ఉన్నారా? వారి వివరాలు ఏంటన్న విషయం తెలియాల్సి వుంది.

readMore

భద్రతలో తిరుపతి మేటి

దేశంలోనే రెండో అత్యుత్తమ నగరం 31వ స్థానంలో విశాఖ, 56వ స్థానంలో కాకినాడ నివాస అనుకూల నగరాల సూచీలో వెల్లడి దేశంలోనే అత్యుత్తమ రక్షణ, భద్రత కలిగిన రెండో నగరంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి గుర్తింపు పొందింది. విశాఖపట్నం కొంత మెరుగైన స్థానాన్నే దక్కించుకోగా…రాజధాని ప్రాంతంలో ప్రధాన నగరమైన విజయవాడ వందో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల దేశంలోని 111 నగరాలను పరిశీలించి నివాస అనుకూల నగరాల సూచీ-2018 (ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌-2018)ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయా నగరాల్లో వ్యవస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక మౌలిక వసతుల విభాగాలకు సంబంధించిన పరిపాలన, సంస్కృతి, విద్య, ఆరోగ్యం, రక్షణ, భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, గృహనిర్మాణం, సమ్మిళిత వృద్ధి, విద్యుత్తు తదితర 15 అంశాల్లో స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంది. వాటిని…

readMore

రహస్యంగా పెళ్లి చేసుకుని మోసం… అత్తింటి ముందు బైఠాయించిన యువతి!

హైదరాబాద్ లో పని చేస్తున్న దేవీ కుమారి, వెంకటేశ్వర్లు రహస్యంగా గుడిలో వివాహం ఆపై తీసుకెళ్లకపోవడంతో యువతి నిరసన ఒకే చోట తనతో కలసి పని చేస్తున్న వ్యక్తి, ప్రేమిస్తున్నానని చెప్పి, రహస్యంగా పెళ్లి చేసుకుని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ఓ యువతి అత్తింటి ముందు బైఠాయించింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, విజయనగరం జిల్లాకు చెందిన దేవీకుమారి, ముండ్లమూరు ప్రాంతానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో కలసి పని చేస్తున్నారు. ఇద్దరి మధ్యా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో, పెళ్లి చేసుకోవాలని భావించారు. గత నెలలో దేవీ కుమారి, వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చి మాట్లాడగా, వారు పెళ్లికి అంగీకరించకుండా, సర్దిచెప్పి తిరిగి పంపించారు. ఆపై తనను విడిచి ఉండలేనని చెబుతూ వెంటేశ్వర్లు ఓ గుడిలో తనను పెళ్లాడాడని దేవి…

readMore

‘సైరా’ మ్యాజిక్ డైరెక్టర్ ఖరారు… పరిచయం చేస్తూ ప్రోమో విడుదల!

అమిత్ త్రివేదికి దక్కిన చాన్స్ పలు హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వైరల్ అవుతున్న ప్రోమో తొలుత ఏఆర్ రెహమాన్ అన్నారు. ఆపై తమన్ వచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా వినిపించింది. చివరకు అవకాశం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదికి దక్కించి. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా’ సంగీత దర్శకుడిగా అమిత్ ను తీసుకున్నట్టు చెబుతూ, చిత్ర యూనిట్, ఓ ప్రోమోను విడుదల చేసింది. హిందీలో ‘ఉడాన్’, ‘వేక్‌ అప్‌ సిద్’, ‘ఐషా’, ‘దేవ్‌ డి’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘ఇషక్‌ జాదే’, ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘బాంబే వెల్వెట్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘క్వీన్’ వంటి చిత్రాలకు అమిత్ సంగీతాన్ని అందించాడు. చిరంజీవితో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో…

readMore