ముగిసిన వాజ్ పేయి అంత్యక్రియలు!

చితికి నిప్పంటించిన దత్త పుత్రిక హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు వాజ్ పేయికి కన్నీటీ వీడ్కోలు పలికిన నేతలు మాజీ ప్రధాని వాజ్ పేయి అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో వాజ్ పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మంచి గంధపు చెక్కల చితిపై వాజ్ పేయి పార్ధివ దేహానికి దత్త పుత్రిక నమిత భట్టాచార్య నిప్పంటించారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితులు వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బీజేపీ అగ్రనేతలు, అభిమానులు, ఆయన కుటుంబసభ్యులు వాజ్ పేయికి కన్నీటీ వీడ్కోలు పలికారు. వాజ్ పేయి అంతక్రియల్లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

readMore

‘పవనిజం’ అంటే ‘నిజం’.. ఆ నిజానికి ప్రత్యక్షరూపం పవన్ కల్యాణ్!: నాగబాబు

2008, 2009 నుంచి ‘పవనిజం’ ఉంది ఈ మాట ఎందుకొచ్చిందో కల్యాణ్ బాబుకూ తెలియదు నాక్కూడా మొదట్లో తెలిసేది కాదు జనసేన పార్టీ అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ ను అభిమానించే అభిమానుల నోటి నుంచి తరచుగా వినబడుతుండే మాట ‘పవనిజం’. అసలు, ‘పవనిజం’ అంటే ఏమిటనే ప్రశ్నకు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘‘పవనిజం’ అనేది పార్టీ పెట్టకముందు నుంచి.. 2008, 2009 నుంచి ఉంది. ఈ ‘పవనిజం’ అనే మాట ఎందుకొచ్చిందో కల్యాణ్ బాబుకు కూడా తెలియదు. నాక్కూడా మొదట్లో తెలిసేది కాదు. అసలు ‘పవనిజం’ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. కానీ, ‘పవనిజం’ అని ఎవరైతే అంటున్నారో వాళ్లకు మాత్రం తెలుసు పవనిజమంటే. ‘పవనిజం’ అంటే ట్రూత్. నిజాన్ని మనం…

readMore

‘జీరో బ్యాలెన్స్’ సదుపాయం.. కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఖాతాల వెల్లువ!

811 పొదుపు ఖాతా వల్లే పెరిగిన బ్యాంక్ ఖాతాలు ఎలాంటి చార్జీలు,కనీస నిల్వ కూడా లేకున్నా బ్యాంకింగ్ సేవలు 1.45 కోట్ల కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలందిస్తున్న కోటక్ మహింద్రా బ్యాంక్ కస్టమర్లకు ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ సేవలు భారం అయిన నేపథ్యంలో, ఎలాంటి చార్జీలు లేకుండా సేవలందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ పొదుపుఖాతా పధకాన్ని అందిస్తోంది. 2017లో ప్రారంభించిన 811 పొదుపు ఖాతా పథకం వల్ల గత 15 నెలల వ్యవధిలో 65 లక్షల మంది తమ బ్యాంకులో ఖాతాలు తెరిచినట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంకు వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి మొత్తం ఖాతాదారుల సంఖ్య 1.45 కోట్లకు చేరిందని బ్యాంకు తెలిపింది. తమకు ఏపీలో 106 శాఖలు, తెలంగాణలో 82 శాఖలు ఉన్నాయనీ, త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల్లో కొత్తగా 5 శాఖలు…

readMore

‘స్టార్ మహిళ’కు ఇక సెలవంటున్న సుమ!

స్టార్ మహిళ కార్యక్రమం ముగుస్తుందని చెప్పిన సుమ 12 ఏళ్ళుగా స్టార్ మహిళను ఆదరించిన వారికి కృతజ్ఞతలు ఫినాలేలో స్టార్ మహిళపై అభిమానుల సెల్ఫీ వీడియోల ప్రసారం ఆమె తన మాటలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. మలయాళీ అయినా తెలుగును అనర్గళంగా మాట్లాడుతుంది. మంచి ఉచ్చారణ, వినసొంపైన కంఠంతో చక్కని ప్రతిభాపాటవాలతో బుల్లితరపై రాణించిన స్టార్ మహిళ సుమ.. తెలుగు టెలివిజన్ రంగంలో సుమ చేసినన్ని కార్యక్రమాలు మరే యాంకర్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. 12 ఏళ్ళుగా ‘స్టార్ మ‌హిళ’ అనే కార్య‌క్ర‌మాన్ని ఏ మాత్రం బోర్ అనిపించకుడా ఒంటి చేత్తో ముందుకు న‌డిపించిన సుమ ఇక ‘స్టార్ మహిళ’కు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ప్ర‌తి రోజు ఈటీవీలో మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కి ప్ర‌సార‌మ‌య్యే ఈ షోలో మహిళలతో ఆడించి, పాడించి, వారిలో ఉత్సాహాన్ని నింపి స్టార్…

readMore

అనుకోకుండా హైదరాబాద్ లో దిగి.. టాక్సీ మాట్లాడుకుని…!

1980 దశకంలో బీజేపీ అధ్యక్షుడిగా వాజ్ పేయి బెంగళూరు వెళుతూ మధ్యలో హైదరాబాద్ లో ఆగిన విమానం ఆ సమయంలో నగరంలో హెగ్డేవార్ శతజయంతి వేడుకలు విషయం తెలిసి విమానం దిగేసిన వాజ్ పేయి ఇది 1980 దశకం నాటి సంగతి. అటల్ బిహారీ వాజ్ పేయి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 1980 నుంచి 1986 వరకూ పనిచేశారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టాక్సీ వేసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆయన కర్ణాటకలో ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సిన నిమిత్తం విమానంలో బయలుదేరగా, మార్గమధ్యంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో విమానం ఆగింది. ఆ సమయంలో హైదరాబాద్ లో హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారని వాజ్ పేయికి ఎవరో చెప్పారు. వెంటనే ఆయన విమానం దిగి, బయటకు…

readMore