మాజీ ప్రధాని వాజ్‌పేయీ కన్నుమూత

  రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05గంటలకు తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల/ మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు చిత్త వైకల్యం (డెమెన్షియా)తో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో జీవనాధార వ్యవస్థపై ఉంచారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో డిసెంబర్ 25, 1924న మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజ్‌పేయీ. ఆయన తండ్రి కృష్ణబిహారీ గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వాజ్‌పేయీ గ్వాలియర్‌లోని సరస్వతి శిశుమందిర్‌‌లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం…

readMore

బ్రహ్మణి వెళ్లి రాహుల్ ను కలవడం దేనికి నిదర్శనం: విజయసాయిరెడ్డి

పారిశ్రామికవేత్తలతో రాహుల్ సమావేశం హాజరైన నారా బ్రాహ్మణి రాహుల్ వి నీచపు రాజకీయాలన్న విజయసాయి రెండు రోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హైదరాబాద్ లో పర్యటించిన వేళ, పారిశ్రామికవేత్తలతో సమావేశంకాగా, దానికి నారా చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి హాజరైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలు గుప్పించారు. “దిగ్గజ నేత డాక్టర్ వైఎస్ఆర్ కుమారుడిని తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, రాహుల్ గాంధీ కేసులను పెట్టించి గతంలో జైలుకు పంపారు. నేడు ఆయన చంద్రబాబు కుమార్తెను కలిశారు. ఇది దేనికి నిదర్శనం? రాహుల్ గాంధీ నీచ రాజకీయాలు అట్టడుగు స్థాయికి దిగజారాయి. అవునా?” అని ట్వీట్ పెట్టారు.

readMore

ఆయుష్మాన్ భారత్… ఆరోగ్య బీమా పథకానికి అర్హతలివి!

వచ్చే నెల నుంచి అమలులోకి ఆరోగ్య బీమా పథకం సుమారు 50 కోట్ల మందికి లబ్ధి నిరుపేదలు, అట్టడుగు, బడుగు బలహీన వర్గాలకు లాభం ప్రతి కుటుంబానికీ సంవత్సరానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను దగ్గర చేసేలా ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్టు నిన్న ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. సుమారు 50 కోట్ల మందికి ఈ పథకం లబ్ధిని చేకూర్చనుంది. ఈ పథకానికి అర్హత పొందాలంటే, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా గోడలు, కచ్చా పైకప్పుతో ఒకే గదిలో నివాసముంటున్న కుటుంబాలు, మహిళ కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలు, దివ్యాంగులు ఉన్న కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, రోజువారీ కూలీపై ఆధారపడిన భూమి లేని కుటుంబాలు కూడా అర్హతను పొందుతాయి. అనాథలు, యాచకులు పారిశుద్ధ్య పని చేసే కుటుంబాలు,…

readMore

పంబ ఉద్ధృతితో నీట మునిగిన శబరిమల ఉపాలయాలు!

పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు పంబా నదిలో 25 అడుగుల ఎత్తున నీరు మూసుకుపోయిన శబరిమల దారి కేరళలోని పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పంబానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, శబరిమలలోని ఉపాలయాలు నీట మునిగాయి. పంబ వద్ద నదిలో నీటిమట్టం 25 అడుగుల ఎత్తునకు చేరుకోవడంతో, కొండపైకి వెళ్లే దారి మూసుకుపోయింది. దీంతో భక్తులను కొండపైకి వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. పంబలోని స్నాన ఘాట్లు, దాని పక్కనే ఉండే యాత్రికుల విశ్రాంతి భవనాలు, షెడ్లు తదితరాలన్నీ నీట మునిగాయి. పంబా నదికి నీరందించే కాక్కి రిజర్వాయర్, పంబా రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ఎగువన కొండల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

readMore

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

సుధీర్ బాబుతో జతకట్టనున్న మెహ్రీన్ ఏఎల్ విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ మలయాళ చిత్రంలో ‘గూఢచారి’ నాయిక * సుధీర్ బాబు సరసన మెహ్రీన్ కథానాయికగా నటించనుంది. నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారు. ఈ చిత్రం షూటింగ్ రేపు ప్రారంభమవుతుంది. తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. * రాంచరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న సంగతి విదితమే. ఇందుకు గాను ఆయనకు 4 కోట్ల భారీ పారితోషికాన్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఓ బాలీవుడ్ నటుడుకి ఈ స్థాయిలో తెలుగు సినిమాకి పారితోషికం ఇవ్వడం విశేషమే! * ‘గూఢచారి’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక శోభిత ధూళిపాళ మలయాళ చిత్రంలో నటించడానికి…

readMore