జాతీయ జెండా ఎగరవేసిన జనసేన అధినేత పవన్!!

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మరియు జనసేన కార్యకర్తలతో కలిసి జాతీయ జెండా ఎగరవేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

readMore

పేదవాడు రోగమొస్తే భయపడకూడదు

ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించిన మోదీ తొలి విడతలో 10 కోట్ల మందికి వర్తింపు దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. భారత 72వ స్వాతంత్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ఆయన జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ పథకాన్ని మోదీ ప్రకటించారు. సెప్టెంబర్‌ 25న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశంలోని పేదలందరికీ ఉచిత వైద్య సాయం అందిస్తామన్నారు. తొలి విడతలో 10కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోగమొస్తే ఏం చేయాలన్న భయం పేదల్లో ఉండకూడదని మోదీ అన్నారు. ఇంట్లో ఒకరికి రోగమొస్తే కుటుంబమంతా దిక్కతోచని…

readMore

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో దెయ్యం.. స్వయంగా చెప్పిన కలెక్టర్!

కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి పునాది రాయి వేసి 133 ఏళ్లు ఇంజినీర్ జార్జ్ పామర్ భార్య శంకుస్థాపన మొదటి అంతస్తులో దెయ్యం ఆమ్రపాలి చెప్పింది ఇదీ.. దెయ్యాలు ఉన్నాయా? ఈ విషయంలో ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కోలా ఉంటాయి. ఎవరి సంగతి ఎలా ఉన్నా వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో మాత్రం దెయ్యం ఉందట. అదంటే ఆమెకు భయమట కూడా. అందుకే ఆ ఇంట్లో పడుకోవడానికి సాహసించడం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె అలా ఎందుకన్నారంటే.. వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి పునాది రాయి వేసి ఆగస్టు 10తో 133 ఏళ్లు నిండింది. ఈ సందర్భంగా తాను నివాసం ఉంటున్న చారిత్రక భవనం గురించి ఆమ్రపాలి మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అప్పట్లో ఈ భవనానికి జార్జ్ పామర్…

readMore

ఏపీ, తెలంగాణ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు:మోదీ

ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని నీలగిరి పుష్పంలా దేశం వికసిస్తోందన్న మోదీ మన బాలికలు అద్భుతం చేశారని ప్రశంస ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికలు దేశ గౌరవాన్నిఇనుమడింపజేశారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దేశప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందన్నారు. సాహసాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోందన్నారు. 12 ఏళ్లకు ఓసారి పుష్పించే నీలగిరి పూలలా దేశం వికసిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రశంసించారు. మన బాలికలు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆత్మవిశ్వాసాన్ని నలుదిశలా చాటారన్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాలు ఫలప్రదమయ్యాయన్న మోదీ.. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. దేశం…

readMore

అభివృద్ధి పథం వీడొద్దు

లక్ష్యాలను సాధించబోతున్నాం అహింస ఎంతో శక్తిమంతమైనది చిత్తశుద్ధితో పనిచేసేవారంతా స్వాతంత్య్ర విలువల పరిరక్షకులే పంద్రాగస్టు సందేశంలో రాష్ట్రపతి కోవింద్‌ ఎంతోకాలం నుంచి నిరీక్షిస్తున్న అనేక లక్ష్యాలను మన దేశం సాధించబోతున్న కీలక తరుణంలో వివాదాస్పద అంశాలు, అన్యమైన విషయాలపై చర్చలతో అభివృద్ధి పథాన్ని వీడొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హితవు పలికారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి ఆయన దూరదర్శన్‌ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. అహింస ఎంతో శక్తిమంతమైనదనీ, సమాజంలో హింసకు తావులేదనీ చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆచరించిన పవిత్ర మంత్రం ఇదేనన్నారు. దేశంలో ఇటీవల పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న మూక దాడుల ఘటనల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘చరిత్రలో ఇంతవరకు మనమెన్నడూ చూడని కీలకమైన కూడలిలో ఇప్పుడున్నాం. బహిరంగ మల విసర్జనకు స్వస్తి పలకడం, అత్యంత పేదరిక నిర్మూలన,…

readMore