ఈటీవీ కథనంపై స్పందించిన కృష్ణా జిల్లా కలెక్టర్‌

కృష్ణా జిల్లా విజయవాడ గ్రామీణ మండలం రామవరప్పాడు జెడ్పీ ఉన్నత పాఠశాల వర్షం నీటికి మునకపై ఈటీవి ఆంధ్రప్రదేశ్ లో ప్రసారమైన కథనానికి కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్, వైద్య-ఆరోగ్యశాఖ, పురపాలకశాఖ అధికారులను అక్కడకు వెళ్లాలని ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో నిలిచిన నీటిని మోటార్లతో తోడాలని ఆదేశించారు. స్కూలులో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు పాఠశాలకు చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపిస్తున్నారు. అలాగే వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ మార్గాలకు మరమ్మతులు చేస్తున్నారు. వివిధ శాఖల సిబ్బంది ఈ పనులు నిర్వహిస్తున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు కలెక్టర్ తన వద్ద పనిచేసే అధికారి అంకాల్‌ను అక్కడికి పంపారు. ఇవాళ సాయంత్రానికల్లా నీటిని పూర్తిస్థాయిలో తోడేస్తామని అధికారులు చెబుతున్నారు.…

readMore

ఒక డాల‌ర్‌.. 70 రూపాయ‌లు

డాల‌ర్‌తో రూపాయి విలువ ఇవాళ కూడా మ‌రింత ప‌త‌న‌మైంది. మార్కెట్ చ‌రిత్ర‌లో తొలిసారి డాల‌ర్‌తో రూపాయి విలువ 70.1గా న‌మోదు అయ్యింది. ఈ ఏడాదిలోనే రూపాయి విలువ 10 శాతం ప‌డిపోయింది. సోమ‌వారం మార్కెట్ల‌లో రూపాయి విలువ 69.91 వ‌ద్ద నిలిచిపోయింది. అయితే అక్క‌డ నుంచి మొద‌లైన ట్రేడింగ్ ఇవాళ ఉద‌యం ఆరంభంలో కొంత మెరుగుప‌డింది. 23 పైస‌లు కోలుకుని 69.28 వ‌ద్ద కొద్ది సేపు నిలిచింది. ట‌ర్కీ క‌రెన్సీ లీరా ప్ర‌కంప‌న‌లు ద‌లాల్ స్ట్రీట్‌ను తాక‌డంతో రూపాయి విలువ మ‌ళ్లీ ప‌త‌న‌మైంది. ఉద‌యం 10.30 గంట‌ల స‌మ‌యంలో.. డాల‌ర్ విలువ 70.07గా న‌మోదు అయ్యింది. జీవితకాల కనీస స్థాయికి డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనీస స్థాయికి పతనం అయింది. సోమవారం ఒక్క రోజులోనే రూ.1.10 లేదా 1.57 శాతం నష్టపోయి రూ.69.93 వద్ద…

readMore

మోదీకి సంబంధాలు చూస్తానని జోకేసిన ట్రంప్‌‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీకి పెళ్లి సంబంధం చూస్తానని జోక్‌ చేశారట. అసలు ట్రంప్‌, మోదీకి సంబంధం చూడడమేంటి.. అలా ఎందుకు అన్నారని అనిపిస్తోంది కదా. గత ఏడాది మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారట. ఈ మేరకు పొలిటికో అనే పత్రిక ‘దౌత్యపరమైన తప్పిదాలు’ పేరిట ఓ కథనం ప్రచురించింది. అందులో ట్రంప్ దేశాధినేతలతో సమావేశాల సమయంలో చేసిన తప్పులు, టెలిఫోన్ సంభాషణలో పొరపాట్లు, ఉచ్ఛారణ లోపాలు, ఇబ్బందికర వ్యాఖ్యల గురించి రాశారు. ఈ కథనంలో ట్రంప్‌, మోదీపై వేసిన జోక్‌ గురించి కూడా వెల్లడించారు. గత ఏడాది మోదీ వైట్‌హౌస్‌ పర్యటన నేపథ్యంలో ట్రంప్‌ ముందుగానే దక్షిణాసియా గురించి, మోదీ గురించి పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారట. అయితే మోదీ ఒంటరిగా…

readMore

విభజన హామీలు అమలుచేయాలి

విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా.. కనీసం 20వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. వరి, మక్కలకు కనీసం మద్దతు ధర రెండువేల రూపాయలు చెల్లించాలని విజ్ఞప్తిచేసింది. రైతులకు మేలు చేకూర్చేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరింది. సోమవారం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వాటి వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. వాటిని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి పంపిస్తామని తెలిపారు. ఆమోదించిన తీర్మానాలు ఇవీ.. 1.విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి,…

readMore

What’s Cooking Between Alia Bhatt And Ranbir Kapoor’s Ex-Girlfriend Katrina Kaif

Alia Bhatt has dismissed any form of stress between herself and her current boyfriend Ranbir Kapoor‘s ex-girlfriend Katrina Kaif. Alia was interacting with the media on the sidelines of the Caprese bags new collection launch on Monday here.Alia and Katrina were known to share a close bond. They used to post pictures of their workout routines on social networking site Instagram, which were quite popular.But ever since Alia started dating Ranbir, there have been reports that the girls were no longer on sweet terms. Even the Instagram posts have vanished. Reacting to these reports, Alia…

readMore