కాకి సందేశం

చాలా మంది ఆహార పదార్థాలు తినేసి వాటి కాగితాలను, చెత్తను రోడ్ల మీదే పడేస్తుంటారు. దీని వల్ల మన పరిసరాలను మనమే చేతులారా పాడుచేసుకుంటున్నాం. కానీ, ఇక్కడ మాత్రం కాకులు చెత్తను ఏరేస్తున్నాయి. మనుషులు చెత్తవేసి పర్యావరణాన్ని పాడుచేస్తుంటే.. అవి మాత్రం శుభ్రం చేస్తున్నాయి. చెత్తను నోటకరుచుకుని తీసుకెళ్లి చక్కగా డస్ట్‌బిన్‌లో పడేస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అవి చేసే పని చూస్తే మాత్రం ముచ్చటేస్తుంది. ఫ్రాన్స్‌లోని పై డూ ఫ్యూ అనే థీమ్‌ పార్క్‌లో చెత్తను శుభ్రం చేసేందుకు కార్మికులు ఉండరు. వారి స్థానంలో కాకులు కనిపిస్తాయి. ఆరు కాకులు ఈ థీమ్‌ పార్క్‌లోని చెత్తను శుభ్రం చేస్తాయి. సందర్శకులు వేసే చెత్తను ఒక్కొక్కటిగా తీసుకెళ్లి చక్కగా చెత్తబుట్టలో వేస్తాయి. సిగరెట్‌ పీకలు, చిన్న చిన్న ప్యాకెట్లు, కాయలు, విత్తనాలు ఇలా అన్నింటినీ నోట కరుచుకుని…

readMore

అల్లు అర్జున్ దాతృత్వం .. కేరళ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం!

భారీ వర్షాల కారణంగా స్తంబించిన జనజీవనం మోహన్ లాల్ కూడా రూ.25 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురి విరాళం కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు, హీరోలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సీఎం సహాయనిధికి చేతనైనంత సహాయం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి కమలహాసన్ రూ.25 లక్షల విరాళం అందజేయగా, తాజాగా అల్లు అర్జున్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రూ.25 లక్షల చొప్పున విరాళం అందించారు. కాగా, కేరళలో భారీ వర్షాల కారణంగా వేల ఇళ్లు, పలు రోడ్లు దెబ్బతిన్నాయి.

readMore

పార్లమెంట్ దగ్గర ఉమర్ ఖాలిద్‌పై కాల్పులు

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల నుంచి ఖాలిద్ సురక్షితంగా బయటపడ్డాడు. పార్లమెంట్ సమీపంలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ దగ్గర హైసెక్యూరిటీ జోన్‌లో స్వాతంత్య్ర దినోత్సవాలకు రెండు రోజుల ముందు ఈ ఘటన జరగడం సంచలనం రేపింది. యునైటెడ్ అగైన్‌స్ట్ హేట్ అనే సంస్థ నిర్వహించిన ఖౌఫ్ కే ఆజాది అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖాలిద్ అక్కడికి వచ్చాడు. ఈ దాడి తర్వాత ఖాలిద్ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం దేశంలో ఓ భయానక వాతావరణం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను బెదిరిస్తున్నారు అని ఖాలిద్ అన్నాడు. గత జూన్ నెలలోనే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఖాలిద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాలిద్‌పై కాల్పుల ఘటన…

readMore

బిగ్ బాస్ సీజన్-12కు రూ. 288 కోట్లు వసూలు చేస్తున్న సల్మాన్ ఖాన్!

12 రోజులు షూటింగ్ లో పాల్గొననున్న సల్మాన్ రోజుకు రెండు ఎపిసోడ్ల చిత్రీకరణ ఎపిసోడ్ కు రూ. 12 కోట్ల వసూలు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పటికే 11 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్-12 ప్రారంభంకానుంది. ఈ షోకు కూడా సల్మానే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే, ఈ సీజన్ కు ఆయన తీసుకోబోతున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తిరగకమానవు. మూడు నెలల పాటు ప్రసారం కానున్న ఈ షో కోసం సల్మాన్ మొత్తం 12 రోజులు మాత్రమే షోలో పాల్గొనబోతున్నాడు. ఈ 12 రోజుల్లో మొత్తం 24 ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు రూ. 12 కోట్లను సల్మాన్ వసూలు చేస్తున్నాడట. ఈ లెక్కన మొత్తం 24 ఎపిసోడ్లకు సల్మాన్ కు…

readMore

చంద్రబాబుపై మండిపడ్డ జగన్

మా నిజనిర్ధారణ కమిటీ వారిని అరెస్టు చేస్తారా? బాబు తప్పులు కప్పిపుచ్చుకునేందుకే 144 సెక్షన్  ఇంకెంత కాలం పోలీసులను అడ్డుపెట్టుకుంటారు? సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా గురజాలలో మైనింగ్ కుంభకోణాన్ని పరిశీలించడానికి తమ పార్టీ నిజనిర్ధారణ కమిటీ వెళ్తే అక్రమంగా అరెస్ట్ లు చేశారని జగన్ విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి 144 సెక్షన్ పెట్టారని విమర్శించారు. చంద్రబాబు అక్రమాలు, కుంభకోణాలు బయటపడకుండా ఉండేందుకు ఆయనకు వ్యతిరేకంగా నినదిస్తున్న గొంతులను నొక్కడానికి, ఇంకెంత కాలం పోలీసులను ఆయన అడ్డుపెట్టుకుంటారని ఆ ట్వీట్ లో ప్రశ్నించారు. కాగా, గురజాలలో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు వైసీపీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు.…

readMore