బ్రేకింగ్.. మల్టిప్లెక్సులపై వినియోగదారుల ఫోరం కొరడా.. రూ.25 లక్షల జరిమానా!

విజయవాడలో అధిక ధరలపై ఫోరం ఆగ్రహం బయటి ఆహారాన్ని అనుమతించాలని ఆదేశం తెలుగులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మాధవరావు ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ ను అధిక ధరలకు అమ్ముతున్న మల్టిప్లెక్స్ లకు విజయవాడ వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. ఎల్ఈపీఎల్, ట్రెండ్ సెట్, పీవీఆర్, పీవీఐ, ఐనాక్స్ మల్టిప్లెక్స్ లకు రూ.5 లక్షలు చొప్పున రూ.25 లక్షల జరిమానా విధించింది. విజయవాడకు చెందిన ఓ వినియోగదారుడు దాఖలుచేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి మాధవరావు ఈ రోజు అందరికి అర్థమయ్యేలా తెలుగులో తీర్పు ఇచ్చారు. ఆహార పదార్థాల ధరలను డిస్ ప్లేలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మల్టిప్లెక్స్ లకు వచ్చే ప్రజలు బయటి నుంచి ఆహార పదార్థాలు, నీళ్లు తెచ్చుకునేందుకు అనుమతించాలని వాటి యాజమాన్యాలను ఫోరం ఆదేశించింది. తమ ఆదేశాలు వెంటనే అమలయ్యేలా చర్యలు…

readMore

భారీ చారిత్రక చిత్రంలో జాన్వీ కపూర్ .. బడ్జెట్ 500 కోట్లు

కరణ్ జొహార్ నిర్మాతగా చారిత్రక చిత్రం కథానాయకుడిగా రణ్ వీర్ సింగ్ కథానాయికలుగా కరీనా .. అలియా భట్ తొలి చిత్రంతోనే జాన్వీ కపూర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నటన పరంగాను .. గ్లామర్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. దాంతో జాన్వీ కపూర్ ను వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ భారీ చారిత్రక చిత్రంలో నటించే ఛాన్స్ ఆమెకి దక్కింది .. ఆ సినిమా పేరే ‘తక్త్’. ఈ పేరుకి ‘సింహాసనం’ అనే అర్థం వుంది. అందువలన ఇది సింహాసనం కోసం కొనసాగే పోరాట చిత్రంగా ఉంటుందని అనుకోవచ్చు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో కరణ్ జొహార్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన కరీనా కపూర్…

readMore

‘ఏక్ బీకే… కోయీ నహీ బికే’… మోదీ సెటైర్!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో హరివంశ్ గెలుపు ఇరు పక్షాల్లో ఓ ‘హరి’ ఉన్నాడన్న ప్రధాని ఎవరూ అమ్ముడు పోలేదని వ్యాఖ్య ఈ ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి బీకే హరిప్రసాద్ ను ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఓడించిన తరువాత, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. “ఈసారి ఎన్నికల్లో సభలోని రెండు పక్షాలూ చెరో ‘హరి’ని కలిగివున్నాయి. అయితే, ఒకరి పేరులో ‘బీకే’ ఉంది ‘కోయీ నహీ బికే’ (ఎవ్వరూ అమ్ముడు పోలేదు)” అని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలుపును విపక్షాలు అంగీకరించక పోవడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు ఓటింగ్ నిర్వహించడంతో హరివంశ్ కు 125, హరి ప్రసాద్ కు 105 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై సభలోకి…

readMore

రివ్యూ: శ్రీనివాస కళ్యాణం

వరుస మాస్‌ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసి, ‘ఇష్క్‌’తో తన పంథాను మార్చుకున్న యువ కథానాయకుడు నితిన్‌. ఈ ఏడాది ‘ఛల్‌ మోహన్‌రంగా’ చిత్రంతో అలరించిన నితిన్‌..తాజాగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. కథల ఎంపికలో తనదైన ముద్రవేయడమే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించగల నిర్మాత దిల్‌ రాజు. గతేడాది సతీష్‌ వేగేశ్నతో కలిసి ‘శతమానం భవతి’తో బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ అందించారు. ఇప్పుడు అదే దర్శకుడితో ‘శ్రీనివాస కళ్యాణం’ అంటూ మరోసారి కుటుంబ కథా నేపథ్యాన్నే ఎంచుకున్నారు. గత చిత్రంలో పండగ విశిష్టతను చెప్పిన దర్శకుడు, ఈసారి పెళ్లి ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు. మరి ‘శ్రీనివాస కళ్యాణం’ కమనీయంగా జరిగిందా? అతిథులుగా థియేటర్లకు విచ్చేసిన ప్రేక్షకులకు చిత్ర బృందం ఎలాంటి విందు భోజనాన్ని వడ్డించింది? కథేంటంటే: విలువలు, కట్టుబాట్లు,…

readMore

హమ్మయ్యా.. కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరికింది!: సీఎంతో సమావేశమైన డీఎస్

పార్టీ వ్యతిరేక ఆరోపణలపై వివరణ కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా భేటీ డీఎస్ పై గతంలో ఫిర్యాదు చేసిన కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్(డీఎస్) ఈ రోజు భేటీ అయ్యారు. ఇటీవల నిజామాబాద్ లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అక్కడి నేతలు చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన కేసీఆర్ తో ఆయన ఈ రోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగిన ఓటింగ్ లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి డీఎస్ పాల్గొన్నారు. కొన్నిరోజుల క్రితం డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలతో కలిసి సీఎంకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీంతో ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు…

readMore