డీఎంకే అధినేత కరుణానిధి మృతి

చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణ కన్నీరుమున్నీరవుతున్న అభిమానులు డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి (94) మృతి చెందారు. అనారోగ్యంతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈరోజు సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. కాగా, గత నెల 24వ తేదీన కరుణానిధిని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అదే ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. వయో భారం కారణంగా కరుణానిధి శరీర అవయవాలు చికిత్సకు స్పందించలేదు. కరుణ ఆరోగ్యం మెరుగు పరిచేందుకు వైద్యులు ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కరుణ మృతి వార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన…

readMore

‘క్రిస్టొఫర్‌ రాబిన్‌’ కొంప ముంచిన టెడ్డీ బేర్.. చైనాలో అంతే!

‘క్రిస్టొఫర్‌ రాబిన్‌’ విడుదలకు చైనా నిరాకరణ  ‘విన్నీ ద పూ’ సీరీస్ నుండి వస్తున్న చిత్రం కావటమే కారణం  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను టెడ్డీ బేర్ తో పోల్చటమే కారణం హాలీవుడ్ ఫాంటసీ కామెడీ డ్రామాగా బాగా పాప్యులర్ అయిన  ‘విన్నీ ద పూ’ సిరీస్‌ నుండి వచ్చిన చిత్రం ‘క్రిస్టొఫర్‌ రాబిన్‌’. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం చైనాలో మాత్రం విడుదల కాలేదు. చైనా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిరాకరించింది. అయితే, దీని విడుదలకు చైనా నిరాకరించటానికి కారణం ‘టెడ్డీ బేర్’! ఆశ్చర్యంగా ఉంది కదూ? అసలు ఈ టెడ్డీ బేర్ విషయంలో చైనా ఎందుకు సీరియస్ గా వుంది? అంటే దానికి పెద్ద కారణమే ఉంది మరి. డిస్నీ సంస్థకు చెందిన పాప్యులర్ సీరీస్ ‘విన్నీ ద పూ’…

readMore

‘జనసేన’ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ కు తుది రూపు

పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చ మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు, ప్రాధాన్యాలపై చర్చ జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ వెల్లడి జనసేన మేనిఫెస్టో పార్టీ సిద్ధాంతాలకు అద్దంపడుతూ… ప్రజా క్షేమం, అభివృద్ధి పరమావధిగా, మానవీయ కోణంతో ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన బృందంతో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (ప్యాక్) సోమ, మంగళవారాల్లో చర్చించింది. ఈ సమావేశాల్లో ప్యాక్ కన్వీనర్ మాదాసు గంగాధరం, ప్యాక్ సభ్యులు తోట చంద్రశేఖర్, మారిశెట్టి రాఘవయ్య, అర్హం యూసుఫ్, అశోక్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ చెప్పిన ఏడు సిద్ధాంతాల్లోని స్ఫూర్తి ప్రతి అంశంలోనూ ఉంటుందని, మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు, ప్రాధాన్యాలపై చర్చించామని ప్యాక్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమస్యలు, వాటికి చేపట్టాల్సిన పరిష్కారాలు,…

readMore

ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న పీడీ అకౌంట్స్..

పీడీ అకౌంట్ అంటే పర్సనల్ డిపాజిట్ అకౌంట్ శాఖలు, సంస్థల పేర్లతోనే ఈ ఖాతాలు ఉంటాయి వ్యక్తిగత పేర్లతో ఈ అకౌంట్లు ఉండవు పీడీ అకౌంట్ల ద్వారా ఏపీలో భారీ స్కామ్ జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇది 2జీ స్కామ్ కన్నా పెద్దదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో పీడీ అకౌంట్స్ అంటే ఏమిటనే సందేహం పలువురిలో నెలకొంది. ఈ అకౌంట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ ఫైనాన్షియల్ కోడ్ చాప్టర్ 9లో పేర్కొన్న సివిల్ డిపాజిట్లలో పర్సనల్ డిపాజిట్ (పీడీ) అకౌంట్స్ ఒక భాగం. ఏపీఎఫ్సీ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖలు, సంస్థల పేర్లతో ఈ ఖాతాలు ఉంటాయి. శాఖలు, సంస్థల పేర్లతోనే ఈ ఖాతాలను నిర్వహిస్తారే తప్ప,…

readMore

నాగార్జున, నానిల ‘దేవదాస్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

ఆకట్టుకుంటున్న ‘దేవదాస్’ ఫస్ట్ లుక్ గన్, మందు బాటిల్ తో నాగ్ మెడలో స్టెతస్కోప్ తో నాని టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ ‘దేవదాస్’. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే విడుదల చేసిన లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగ్ ఓ చేతిలో గన్, మరో చేతిలో మందు బాటిల్ పట్టుకుని ఉండగా, నాని మెడలో స్టెతస్కోప్ వేసుకుని ఉన్నాడు. వీటితోనే వీరిద్దరూ బెడ్ పై నిద్రిస్తున్నారు. సెప్టెంబర్…

readMore