మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తూ…కారు బోల్తా పడి ఇద్దరి మృతి..

చేర్యాల: సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా… ఆరుగురు గాయపడ్డారు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన 8 మంది యువకులు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి ఆదివారం వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విష్ణు ప్రసాద్‌(18), బాలరాజు(25) మృతి చెందారు. క్షతగాత్రులను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు కొమరవెల్లి ఎస్సై సతీశ్‌ తెలిపారు.

readMore

వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చున్నారు: లోకేష్ ఎద్దేవా

రాష్ట్రం పట్ల వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు విపక్షాల ఆరోపణలపై మీడియా ఎదుట చర్చకు మేము సిద్ధం అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతాం రాష్ట్ర ప్రయోజనాల పట్ల వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి, అంతా ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మీడియా ఎదుట చర్చకు తాము సిద్ధమని… మీరు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాసం పెడతామని చెప్పారు. ప్రత్యేకహోదా ఇవ్వని ప్రధాని మోదీని జగన్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చుదిద్దుతామని తెలిపారు. అంతర్జాతీయ క్రియేటివిటీ సెంటర్ గా అమరావతి ఎదగాలని ఆకాంక్షించారు.

readMore

నాలుగు దశాబ్దాల తర్వాత.. ముందస్తు బెయిల్‌

లఖ్‌నవూ: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులు ముందస్తు బెయిల్‌ పొందే అవకాశం రాబోతుంది. ముందస్తు బెయిల్‌కు సంబంధించిన చట్టాన్ని తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని సోమవారం యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పటి వరకు యూపీ, ఉత్తరాఖండ్‌లలో మాత్రమే ముందస్తు బెయిల్‌ పొందే అవకాశం లేదు. ఈ ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నేరస్థులు అరెస్టు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌ ఆప్షన్‌ను ఈ రెండు రాష్ట్రాల్లో అందుబాటులో లేకుండా చేశారు. ఈ సదుపాయం లేకపోవడం వల్ల క్రిమినల్‌ కేసుల్లోని నేరస్థులను పోలీసులు వెంటనే అరెస్టు చేస్తున్నారు. కావాలంటే నిందితులు ఆ తర్వాత బెయిల్‌ పొందే విధంగా అక్కడి చట్టాలు ఉన్నాయి. 1975లో ఎమర్జెన్సీ విధించిన తర్వాతి సంవత్సరం…

readMore

ప్రధాన పాత్రలో అనుష్క .. అతిథి పాత్రలో నాని!

లేడీ ఓరియెంటెడ్ మూవీతో చంద్రశేఖర్ యేలేటి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం అనుష్క చుట్టూ తిరిగే కథ విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటి కనిపిస్తాడు. ‘ఐతే’ .. ‘అనుకోకుండా ఒకరోజు’ .. ‘మనమంతా’ సినిమాలు ఆయన అభిరుచికి అద్దం పడుతుంటాయి. ఆయన దర్శక ప్రతిభకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటాయి. త్వరలోనే ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక కథను ఆయన సిద్ధం చేసుకున్నారట. ఈ పాత్ర కోసం ఆయన ఆల్రెడీ అనుష్కను సంప్రదించి ఆమెను ఒప్పించినట్టుగా సమాచారం. ‘భాగమతి’ తరువాత అనుష్క ఓకే చెప్పిన కథ ఇది. ఈ సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రను నాని చేస్తే బాగుంటుందని భావించిన చంద్రశేఖర్ యేలేటి ఇటీవలే ఆయనను కలిశారని…

readMore

మతం మార్చుకునేవారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదు: బీజేపీ

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఈ చట్టం అమలైతే మతమార్పిడులు చాలా వరకు ఆగిపోతాయి చట్టాన్ని అమలు చేస్తారని ఆశిస్తున్నా వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నేతలు అనునిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ బస్తర్ ఎమ్మెల్యే దినేష్ కశ్యప్ కూడా ఈ జాబితాలో చేరారు. జగదల్పూర్ లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, మతమార్పిడి పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. మతం మార్చుకునేవారికి, ముఖ్యంగా గిరిజనులకు ప్రభుత్వ పథకాలను కల్పించకూడదని, ఆ విధంగా చట్ట సవరణ చేయాలని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, దీన్ని అమలు చేస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ఈ చట్టం అమల్లోకి వస్తే, మతమార్పిడులు చాలా వరకు ఆగిపోతాయని అన్నారు. వారం క్రితం జార్ఖండ్ లో మత స్వేచ్ఛ చట్టం కింద 16 మందిని అరెస్ట్ చేసిన…

readMore