తెలుగు తెరకి మరో నటవారసుడు!

నటుడిగా శివాజీరాజాకి మంచి పేరు  ‘మా’ అధ్యక్షుడిగా బిజీ  హీరోగా ఆయన తనయుడు రంగంలోకి ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన నటుడిగా శివాజీరాజాకి మంచి పేరుంది. కామెడీ టచ్ వున్న పాత్రలను మాత్రమే కాదు .. ఎమోషన్ తో కూడిన పాత్రలను సైతం అద్భుతంగా పోషించారు. అలాంటి శివాజీరాజా ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వున్న ఆయన, తన తనయుడు విజయ్ రాజాను కూడా ఇదే మార్గంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు. అలా విజయ్ రాజా హీరోగా ఒక సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నూతన దర్శకుడు రమాకాంత్ రూపొందించే ఈ సినిమాకి ‘ఏదైనా జరగొచ్చు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘బిగ్ బాస్ 2’ షోకి సంబంధించిన ప్రోమోల ద్వారా ‘ఏదైనా జరగొచ్చు’ అనే మాట…

readMore

ఈ నెల 20 నుంచి ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మె

విజయవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ ఈ సమ్మెకు 13 జిల్లాల లారీ యజమానుల మద్దతు ఈ నెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు దిగనుంది. విజయవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశమైంది. ఈ సమ్మెకు 13 జిల్లాలకు చెందిన లారీ యజమానులు తమ మద్దతు తెలిపారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, గడువు ముగిసిన టోల్ ప్లాజాలను వెంటనే నిలిపివేయాలని, జీఎస్టీ, ఈ-వే బిల్ సమస్యలను పరిష్కరించాలని, థర్డ్ పార్టీ ప్రీమియం పెంపును నిలిపివేయాలని, డిమాండ్ చేస్తూ ఈ బంద్ ను తలపెట్టనున్నట్టు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు.

readMore

పోలవరానికి ఖర్చు చేసిన నిధులు విడుదల చేయండి: నితిన్‌ గడ్కరీతో చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి సాయం చేయాలి ఫిబ్రవరి నాటికి కాంక్రీటు పనులు పూర్తవుతాయి అంచాల ప్రకారం పోలవరానికి రూ.57,940 కోట్లు అవసరం భూసేకరణకే రూ.33 వేల కోట్లు పోలవరానికి ఖర్చు చేసిన రూ.2,200 కోట్ల బకాయిలను కేంద్ర సర్కారు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి చంద్రబాబు పోలవరం పనులను పరిశీలించిన విషయం తెలిసిందే. అనంతరం ఇరువురూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫిబ్రవరి నాటికి కాంక్రీటు పనులు పూర్తవుతాయని, సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ.57,940 కోట్లు అవుతుందని చంద్రబాబు అన్నారు. ఇందులో భూసేకరణకే రూ.33 వేల కోట్లు అవుతుందని…

readMore

‘వీర భోగ వసంత రాయలు’ టైటిల్ పోస్టర్ రిలీజ్

దర్శకుడిగా ఇంద్రసేన పరిచయం  భారీ తారాగణంతో మల్టీ స్టారర్  త్వరలోనే పూర్తి వివరాలు   నారా రోహిత్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ .. నటన పరంగా తనని తాను మలచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇక శ్రీవిష్ణు కూడా ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ .. నటుడిగా మంచి మార్కులను కొట్టేస్తున్నాడు. సుధీర్ బాబు విషయానికే వస్తే మంచి కథల కోసం వెయిట్ చేస్తూ .. విజయాలను అందుకుంటున్నాడు. అలాంటి ఈ ముగ్గురి కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ మూవీ రూపొందుతోంది. ఈ ముగ్గురితో సమానమైన పాత్రను శ్రియ పోషిస్తుంది. అప్పారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఇంద్రసేన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆసక్తిని రేకెత్తించే ఈ కథకి ‘వీర భోగ వసంత రాయలు’ అనే టైటిల్ ను ఇంతముముందే నిర్ణయించారు .. తాజాగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్…

readMore

ఫ్రాన్స్ ను వెనక్కి నెట్టి ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్

2017 ఫిగర్స్ ను విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్ అగ్ర స్థానంలో అమెరికా… ఐదో స్థానంలో బ్రిటన్ 2032 నాటికి మూడో అతిపెద్ద ఆర్థక శక్తిగా ఎదగనున్న భారత్ ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. ఈ క్రమంలో ఫ్రాన్స్ ను ఏడో స్థానానికి నెట్టేసింది. ఈ విరాలను ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. 2017 ఫిగర్స్ ప్రకారం, గత ఏడాది చివరి నాటికి… ఇండియా జీడీపీ 2.597 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఫ్రాన్స్ జీడీపీ 2.582 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2017 జూలై తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకుంది. అయితే, తలసరి ఆదాయం ప్రకారం చూస్తే మాత్రం మన కంటే ఫ్రాన్స్ ఎన్నో రెట్లు ముందుంది. భారత్ జనాభా 130 కోట్లకు పైగా ఉంటే… ఫ్రాన్స్ జనాభా కేవలం…

readMore