ఏపీలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చు.: విజయసాయిరెడ్డి

వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ లెవల్ కమిటీ సమావేశాలు విజయనగరం, అరకులో పర్యటించిన విజయసాయిరెడ్డి, భూమన బూత్ లెవల్ కమిటీల బలోపేతానికి కృషి చేయాలి ఏపీలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చు.. సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు వైసీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. విజయనగరం, అరకు వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ లెవల్ కమిటీ సమావేశాలను ఈరోజు నిర్వహించారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ కమిటీల్లో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. విజయనగరం జిల్లాలో ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ స్థానాలు గెలవాలని అన్నారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, సూక్ష్మ స్థాయిలో పార్టీ నిర్మాణం…

readMore

తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు శోకాన్ని కలిగించాయి: పవన్ కల్యాణ్

ట్రాక్టర్లో బయలుదేరిన కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరం కృష్ణా నదికి వెళ్లిన విద్యార్థుల జీవితాలు విషాదంగా ముగిశాయి మృతుల కుటుంబాలకు నా సానుభూతి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రమాద సంఘటనలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరిజిల్లా లక్ష్మీపురంలో ట్రాక్టర్ మూసి కాల్వలోకి బోల్తా పడి పదిమంది వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణానది సంగమంలో నలుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయి అశువులు బాయడం చెప్పలేనంతగా బాధించిందని అన్నారు. పత్తి చేలో పని చేయడానికి ట్రాక్టర్లో బయలుదేరిన కార్మికులు అనంతలోకాలకు చేరిపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. లక్ష్మీపురంలో మూసి కాల్వ కట్టపై ప్రయాణిస్తున్న ట్రాక్టర్ కాల్వలోకి జారిపోయి పది…

readMore

యాదాద్రి సమీపంలో ఘోరం… ట్రాక్టర్ మూసీ నదిలో పడి 14 మంది దుర్మరణం!

crime

ట్రాక్టర్ లో 30 మంది కూలీలు 19 మంది మహిళలు, 11 మంది పురుషులు మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు యాదాద్రి జిల్లా వేములకొండ సమీపంలోని లక్ష్మాపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మహిళా కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ మూసీ నదిలో బోల్తా పడి 14 మంది మరణించారు. వీరందరూ మహిళా కూలీలే. ఘటనా స్థలి వద్ద మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. వారి బంధుమిత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా కనిపిస్తోంది. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తుండగా, మొత్తం 30 మంది కూలీలుండగా, అందులో 19 మంది మహిళా కూలీలే. ట్రాక్టర్ నదిలో పడుతున్న సమయంలో అందులోని పురుషులంతా బయటకు రాగా, మహిళలు రాలేకపోయారని సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య…

readMore

చంద్రబాబు దూతగా..’ఆనం’ వద్దకు వెళ్లిన ‘గంటా’…!

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రాంరామనారాయణరెడ్డి పార్టీని వీడకుండా ఉండేందుకు ‘చంద్రబాబు’ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ తన వియ్యంకుడైన మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా ‘ఆనం’తో రాయబారం చేయించినట్లు తెలిసింది. తనను ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించినందుకు ‘చంద్రబాబు’కు కృతజ్ఞతలు తెలిపానని, మంత్రి సోమిరెడ్డి 2014లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ..అందరికన్నా సీనియర్‌ అయిన తనను అవమానించారని ‘ఆనం’ ఆవేశంగా మంత్రి గంటాకు చెప్పారట. ‘ఆనం’ చంద్రబాబుతో ముఖాముఖి సమావేశం అయ్యేందుకు ఇష్టపడడం లేదట. ఏదో విధంగా ఒత్తిడి తెచ్చి ‘ఆనం’ను పార్టీ వీడకుండా చేయాలనే ఆలోచనతో ‘చంద్రబాబు’ ఉన్నారు. జరిగిన సంఘటనలు మరిచిపోవాలని, మిగతా వారి కన్నా భవిష్యత్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ‘చంద్రబాబు’ చెబుతున్నారని ‘ఆనం’తో ‘గంటా’ చెప్పగా…’జిల్లా’లో…

readMore

బాలయ్య ‘ఎన్టీఆర్’ బయోపిక్ పై తాజా గుసగుస!

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ చిత్రం రెండు భాగాలుగా తీద్దామని భావిస్తున్న క్రిష్ బాలయ్యతో క్రిష్ చర్చలు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ పై మరో ఆసక్తికరమైన వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను మూడు గంటల సినిమాగా చూపించడం చాలా కష్టమని భావిస్తున్న దర్శకుడు క్రిష్, రెండు భాగాలుగా దీన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఒక భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, మరో భాగంలో రాజకీయ ప్రయాణాన్ని చూపాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు బాలకృష్ణతో తమ మనసులోని విషయాన్ని క్రిష్ చర్చించారని తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. కాగా, ఈ సినిమాకు తొలుత తేజను డైరెక్టర్ గా తీసుకున్న బాలయ్య, ఆ తరువాత…

readMore